Ganesha Idol: ఏడాదికి ఏడాది హిందువులకు పండగల సందడి ఉంటూనే ఉంటుంది. ఉగాదితో మొదలయ్యే ఈ పండగలు.. హిందూ క్యాలెండర్ లోని ప్రతి నెలలో ఏదొక పర్వదినంతో కొనసాగుతూనే ఉంటుంది. తొలిఏకాదశి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా ఎన్నో పండగలు పర్వదినాలను హిందువులు ఘనంగా జరుపుకుంటారు. అయితే పిల్లలు పెద్దలు అత్యంత ఇష్టంగా జరుపుకునే పండగలో ఒకటి వినాయక చవితి.. ఈ చవితి వేడుకల కోసం రెండు నెలల ముందు నుంచే భాగ్యనగరం (Hyderabad) రెడీ అవుతుంది. అయితే వినాయక చవితి సందర్భంగా మండపాల్లో ఏర్పాటు చేసే విగ్రహాల విషయంపై జీహెచ్ఎంసీ(GHMC) ప్రజలకు అవగానే కల్పించే దిశగా చర్యలు మొదలు పెట్టింది.
పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసే వినాయక విగ్రహాలు వద్దు.. పర్యావరణ హితాన్ని కలిగించే మట్టి విగ్రహం ముద్దు అంటూ… మట్టితో చేసిన డెమో గణేశ విగ్రహాన్ని ఎల్.బి.నగర్ జోనల్ ఆఫీస్ ఆవరణలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఈ మట్టి విగ్రహం తయారీ దారుల వివరాలను కూడా పొందుపరిచింది. పౌరులకు మట్టి విగ్రహం గురించి అవగాహన కల్పించడం కోసం ఐదు సర్కిళ్లలోని ప్రముఖ ప్రదేశాలలో ఈ గణేశ విగ్రహాలను ప్రదర్శిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..