నాలుగురోజులు హైదరాబాదీలకు ‘జలగండం’

|

Aug 25, 2019 | 12:32 PM

హైదరాబాద్‌: రాజధాని ప్రజలకు బ్యాడ్ న్యూస్. నగరంలోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా ఆగిపోనుంది. రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లోనూ, ఈ నెల 28, 29 తేదీల్లో మరికొన్ని ప్రాంతాల్లోనూ నీటి సరఫరా నిలవనుందని జలమండలి అధికారులు వెల్లడించారు. గండిపేట నుంచి అసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌బెడ్‌కు నీటి తరలింపులో పైపులైన్‌ కాలువ మరమ్మతులు, అసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌బెడ్‌ క్లీనింగ్‌ దృష్ట్యా  రేపు, ఎల్లుండి.. కృష్ణా మొదటి దశ పైపులైన్‌కు భారీ లీకేజి ఏర్పడడంతో.. దాని మరమ్మతుల గానూ ఈ నెల […]

నాలుగురోజులు హైదరాబాదీలకు జలగండం
Follow us on

హైదరాబాద్‌: రాజధాని ప్రజలకు బ్యాడ్ న్యూస్. నగరంలోని పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా ఆగిపోనుంది. రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లోనూ, ఈ నెల 28, 29 తేదీల్లో మరికొన్ని ప్రాంతాల్లోనూ నీటి సరఫరా నిలవనుందని జలమండలి అధికారులు వెల్లడించారు. గండిపేట నుంచి అసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌బెడ్‌కు నీటి తరలింపులో పైపులైన్‌ కాలువ మరమ్మతులు, అసిఫ్‌నగర్‌ ఫిల్టర్‌బెడ్‌ క్లీనింగ్‌ దృష్ట్యా  రేపు, ఎల్లుండి.. కృష్ణా మొదటి దశ పైపులైన్‌కు భారీ లీకేజి ఏర్పడడంతో.. దాని మరమ్మతుల గానూ ఈ నెల 28 తేదీ బుధవారం ఉద‌యం 6 గంట‌ల నుంచి 29 తేదీ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నీటి సరఫరాను ఆపేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రేపు, ఎల్లుండి మంచినీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలివే.. కాకతీయ నగర్‌, సాలార్జంగ్‌ కాలనీ, పార్ట్‌ పద్మనాభ నగర్‌, కుందర్‌బాగ్‌, వినయ్‌ నగర్‌ కాలనీ, చింతల్‌బస్తీ, హుమాయున్‌ నగర్‌, సయ్యద్‌ నగర్‌, ఏసీ గార్డ్స్‌, ఖైరతాబాద్‌, మల్లేపల్లి, బోయిగూడ కమాన్‌, అజంపుర, నాంపల్లి, దేవిబాగ్‌, అఫ్జల్‌ సాగర్‌, సీతారాంబాగ్‌, హబీబ్‌నగర్‌, ఎస్‌ఆర్‌టీ, జవహర్‌నగర్‌, పీఎన్‌టీ కాలనీ, సాయన్న గల్లీ, అశోక్‌నగర్‌, జ్యోతి నగర్‌, వినాయక్‌ నగర్‌, మైసమ్మ బండ, ఎంసీహెచ్‌ క్వార్టర్స్‌, సెక్రటేరియట్‌, రెడ్‌హిల్స్‌, హిందీ నగర్‌, గోడెకీకబర్‌, గన్‌ఫౌండ్రీ, దోమలగూడ, లక్డీకపూల్‌, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి

ఈ నెల 28, 29 మంచినీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలివే..: అలియాబాద్, మిరాలాం, కిషన్ భాగ్, రియాసత్ నగర్, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, అస్మాన్ ఘాడ్, చంచల్ గూడ, యాకుత్ పుర, మలక్ పేట్, మూసారాంబాగ్‌, బొగ్గులకుంట, అఫ్జల్ గంజ్, హిందినగర్, నారాయణ గూడ, అడిక్ మెట్, శివం, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్‌