Hyderabad: త్రేతాయుగంలో రాముడు.. కలియుగంలో మహిళలు.. 10 గంటల్లోనే రామసేతు ప్రయాణం..

హైదరాబాద్‌కు చెందిన మహిళల బృందం అరుదైన రికార్డ్ సృష్టించింది. రామసేతును ఈది రికార్డ్ నెలకొల్పింది. శ్రీలంక నుంచి రామేశ్వరం వరకు సముద్రాన్ని ఈదారు. 59 కిలోమీటర్ల దూరాన్ని 10 గంటల్లో పూర్తి చేశారు. రామసేతువును ఈదిన తొలి మహిళలుగా రికార్డ్ నెలకొల్పారు.

Hyderabad: త్రేతాయుగంలో రాముడు.. కలియుగంలో మహిళలు.. 10 గంటల్లోనే రామసేతు ప్రయాణం..
Womnes

Edited By:

Updated on: Apr 27, 2026 | 7:47 PM

రామసేతువును ఈదుతూ ఐదుగురు మహిళల బృందం అరుదైన రికార్డు సృష్టించింది. హైదరాబాద్, బర్కత్పురాకు చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియా సారథ్యంలో ఈ బృందం శ్రీలంకలోని తలైమినార్ నుంచి తమిళనాడు రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి వరకు సముద్రాన్ని ఈదింది.

ఇది రికార్డు స్థాయి ప్రయాణం

ఈ ఐదుగురు మహిళల బృందం సుమారు 59 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 10 గంటల 10 నిమిషాల్లో పూర్తి చేసి అద్భుతమైన రికార్డు నెలకొల్పారు ఏప్రిల్ 26 2026న రికార్డ్ సృష్టించారు ఈ ఐదుగురు తల్లులు. వీళ్లంతా అథ్లెట్స్ మాత్రమే కాదు.. పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్న తల్లులు. రామసేతువును ఈదిన తొలి మహిళల బృందంగా వీరు గుర్తింపు పొందారు. ఈ సాహస యాత్ర కేవలం క్రీడ మాత్రమే కాదు. ఒక గొప్ప సామాజిక సందేశంతో కూడుకున్నది. ఈ సందర్భంగా క్వీనీ విక్టోరియా మాట్లాడుతూ.. నేటి యువత డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తల్లులుగా తమ ఆవేదనను తెలియజేయడానికే ఈ స్విమ్ అరేంజ్ చేశామని తెలిపారు బృందం సభ్యులు. ఈ సాహసంలో పాల్గొన్న వారిలో తెలంగాణకు చెందిన క్వీనీ విక్టోరియా, మౌనిక, విజయవాడకు చెందిన రాధికతో పాటు ఢిల్లీ, పూణేకు చెందిన మరో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ స్విమ్ యాత్రకు ‘యూనిఫ్లై అసోసియేషన్’ స్పాన్సర్‌షిప్ అందించింది.

Follow Us