హైదరాబాద్‌లో జనాభాతో పాటుగా వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీంతో సకాలంలో గమ్యస్థానానికి చేరేందుకు వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. వాహనాల సంఖ్య విస్తృతంగా పెరగడంతో ట్రాఫిక్, కాలుష్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. గమ్యస్థానానికి సకాలంలో వెళ్లేందుకు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, సగటు వేగం పెంచడం కోసం కొత్త కొత్త బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. దీనికోసం స్ట్రాటజికల్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (SRDP)కి శ్రీకారం చుట్టారు.
SRDP ద్వారా పథకం ద్వారా మొత్తం 45పనులు చేపట్టగా ఇప్పటి వరకు 35 పూర్తి అయ్యాయి. ఇందిరా పార్కు నుండి వి.ఎస్.టి స్టీల్ బ్రిడ్జి 20వ ఫ్లై ఓవర్‌ను ఆగస్ట్ 19న ప్రారంభించనున్నారు. ఇంతకు ముందు 19 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్‌లు, 7 ఆర్ఓబి/ ఆర్‌యుబీలు,1 కేబుల్ స్టయిడ్ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, పంజాగుట్ట రోడ్డు వెడల్పు, పనులు పూర్తయ్యాయి. ఇందిరా పార్కు నుండి వీఎస్టీ వరకు చేపట్టిన ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జితో SRDP ద్వారా ఇప్పటి వరకు 36 పనులు పూర్తి కాగా అందులో ఈ 20 వ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నది. మిగతా 12 పనులు 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేయనున్నారు. హైదరాబాద్‌లో SRDP ద్వారా రూ.450 కోట్ల వ్యయంతో చేపట్టిన మొట్టమొదటి స్టీల్ ఫ్లై ఓవర్ ఇది. మిగితా ఫ్లై ఓవర్ల కంటే భిన్నంగా మొత్తం స్టీల్‌తో ఫ్లై ఓవర్‌ను పూర్తి చేశారు.మొదటిసారిగా మెట్రోబ్రిడ్జి పై నుండి ఫ్లై ఓవర్ నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి గ్రేటర్లో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థతో పాటు సకాలంలో గమ్యస్థానానికి చేరే అవకాశం ఉంటుంది.
ప్రయోజనాలు
1. ఇందిరా పార్కు నుండి వి ఎస్ టి స్టీల్ ఫ్లై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్) వలన రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది.
2. గతంలో లాగా ఆర్టీసీ ఎక్స్ రోడ్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ లేకుండా పోతుంది.
3. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది.
4. ఇందిరా పార్క్, అశోక్ నగర్,ఆర్టీసీ క్రాస్ రోడ్లలో ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్ లింగంపల్లి వీఎస్టీ జంక్షన్ వరకు సులభంగా వెళ్లడం జరుగుతుంది.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేకత
1.ఇందిరా పార్కు నుండి వీఎస్టీ వరకు 2.62 కిలోమీటర్ల పొడవు గల స్టీల్ ఫ్లైఓవర్‌ను చేపట్టారు.
2.అందుకు ఎలివేటెడ్ కారిడార్ 2.436 కిలో మీటర్లు కాగా అప్ ర్యాంపు 0.106 కి.మీ, డౌన్ ర్యాంపు 0.078 కి.మీ
3. రైట్వే 22.20 మీటర్ల నుండి 36.60 మీటర్ల ఎలివేటెడ్ కారిడార్, కుడి వైపు మార్గం 4 లైన్ల బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్ (16.60 మీటర్లు)
4. మొత్తం 81 పిల్లర్లు. స్టీల్ ఫ్లై ఓవర్ మొత్తం 2620 మీటర్ల పొడవు, స్టీల్‌తో నిర్మాణం 2437 మీటర్ల పొడవు, స్పాన్ పొడవు 297 మీటర్లు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం