Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం..

|

Oct 31, 2023 | 7:34 PM

Hyderabad Water Supply News: హైదరాబాద్ నగర వాసులకు జలమండలి కీలక సూచనలు చేసింది. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు జలమండలి మంగళవారం కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా వాటర్ సప్లై పథకం ఫేజు - 2 లో భాగంగా..

Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం..
Drinking Water Supply
Follow us on

Hyderabad Water Supply News: హైదరాబాద్ నగర వాసులకు జలమండలి కీలక సూచనలు చేసింది. పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు జలమండలి మంగళవారం కీలక ప్రకటన చేసింది. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా వాటర్ సప్లై పథకం ఫేజు – 2 లో భాగంగా పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మరమ్మతు పనులు తేది: 01.11.2023.. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా (02.11.2023) గురువారం ఉదయం 6 గంటల వరకు జరుగుతాయని తెలిపింది. కావున ఈ 24 గంటలు జలమండలి పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని.. ప్రజలు గమనించాలని సూచించింది.

తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాలు..

  • ఓ అండ్ ఎం డివిజన్ – 6 : ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్ (లోప్రెజర్ తో నీటిసరఫరా)..
  • ఓ అండ్ ఎం డివిజన్ – 8 : హఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు..
  • ఓ అండ్ ఎం డివిజన్ – 9 : కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్య నగర్ కాలనీ, వసంత్ నగర్.
  • ఓ అండ్ ఎం డివిజన్ – 15 : ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్.
  • ఓ అండ్ ఎం డివిజన్ – 24 : బీరంగూడ, అమీన్ పూర్, బొల్లారం.

కావున పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి కోరింది. మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత తాగునీటి సరఫరా జరగుతుందని హైదరాబాద్ నగర వాసులకు సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..