Hyderabad: ఉసురు తీసిన బట్టతల.. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో డాక్టర్ ఏం చేశాడంటే..

|

Mar 27, 2025 | 10:37 AM

34 ఏళ్లు.. ఉన్నతంగా చదువుకున్నాడు.. వైద్య వృతి.. సమాజంలో మంచి పేరు కూడా ఉంది.. కానీ పెళ్లి కావడంలేదు.. బట్ట తల ఉందని అమ్మాయిలు పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఓ సంబంధం కుదిరింది.. ఇటీవల నిశ్చితార్ధం కూడా జరిగింది.. కానీ.. బట్టతల ఉందని.. ఇతర కారణాలను ఆ అమ్మాయి చెప్పి.. పెళ్లిని ఆపింది.

Hyderabad: ఉసురు తీసిన బట్టతల.. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో డాక్టర్ ఏం చేశాడంటే..
Crime News
Follow us on

34 ఏళ్లు.. ఉన్నతంగా చదువుకున్నాడు.. వైద్య వృతి.. సమాజంలో మంచి పేరు కూడా ఉంది.. కానీ పెళ్లి కావడంలేదు.. బట్ట తల ఉందని అమ్మాయిలు పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఓ సంబంధం కుదిరింది.. ఇటీవల నిశ్చితార్ధం కూడా జరిగింది.. కానీ.. బట్టతల ఉందని.. ఇతర కారణాలను ఆ అమ్మాయి చెప్పి.. పెళ్లిని ఆపింది.. దీంతో కుదిరిన సంబంధం కూడా అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఆ యువ డాక్టర్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు.. చివరకు ట్రైన్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివాహం కావడంలేదన్న మనస్తాపంతో ఓ బస్తీ దవాఖానాలో వైద్యుడిగా సేవలందిస్తున్న డాక్టర్ పురోహిత్‌ కిషోర్‌ (34) అనే వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపారు.

సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ప్రకాష్‌మాల్‌ దంపతులకు ఇద్దరు కుమారులు.. వీరిలో చిన్న కుమారుడు పురోహిత్‌ కిషోర్‌ ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా అల్వాల్‌ బస్తీ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.. ఈ క్రమంలోనే.. కిషోర్‌కు కొన్నిరోజుల కిందట ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అంతా బాగానే ఉందనుకున్న క్రమంలోనే.. కిషోర్ కు బట్టతల ఉండడం, ఇతర కారణాల వల్ల ఆ అమ్మాయి అతనితో పెళ్లికి నిరాకరించింది.. దీంతో నిశ్చితార్థం అర్ధాంతరంగా రద్దయింది.

ఆ తర్వాత కిషోర్ కు వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు సంబంధాలను చూస్తున్నా కుదరడం లేదు.. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కిషోర్‌ బుధవారం ఉదయం తన ద్విచక్రవాహనంపై ఇంట్లో నుంచి బటయకు వెళ్లాడు.. ఆ తర్వాత బొల్లారం వెళ్లి అక్కడ రైల్వేస్టేషన్‌ వద్ద వాహనాన్ని ఉంచాడు.. అనంతరం సమీపంలోని క్యావలరీ బ్యారక్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతానికి చేరుకున్న కిషోర్.. నిజామాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న హుజూర్‌సాహిబ్‌ నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

గుర్తించిన రైలు లోకో పైలెట్‌.. జీఆర్పీ పోలీసులకు సమాచారాన్ని అందించారు.. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతని వద్ద ఉన్న గుర్తింపు కార్డు చిరునామా ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు.. అనంతరం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. కిషోర్ మృతితో కుటుంబంలో విషాదఛాయులు అలుముకున్నాయి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..