అనుమతి ఉంటేనే “న్యూ ఇయర్‌’ సెలబ్రెషన్స్‌..

|

Dec 20, 2019 | 2:49 PM

కొత్త సంవత్సరం సమీస్తోంది.. నూతన సంవత్సర వేడుకలకు జంట నగరాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు హోటల్స్‌, పబ్బులు, క్లబ్బులు ఈవెంట్స్‌ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కొత్త సంవత్సర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాము సూచించిన నిబంధనలను నిర్వాహకులు తప్పకుండా పాటించాలని పోలీసులు ఆదేశించారు. లేదంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు […]

అనుమతి ఉంటేనే న్యూ ఇయర్‌ సెలబ్రెషన్స్‌..
Follow us on

కొత్త సంవత్సరం సమీస్తోంది.. నూతన సంవత్సర వేడుకలకు జంట నగరాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు హోటల్స్‌, పబ్బులు, క్లబ్బులు ఈవెంట్స్‌ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కొత్త సంవత్సర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాము సూచించిన నిబంధనలను నిర్వాహకులు తప్పకుండా పాటించాలని పోలీసులు ఆదేశించారు. లేదంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు సీపీ అంజనీకుమార్‌.

హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వాహకులు తప్పని సరిగా పోలీసుల నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించారు హైదరాబాద్‌ సీసీ. వేడుకలకు అనుమతులు తీసుకోని వారిపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
భద్రత మొదలుకుని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వేడుకల సమయం, ఎంత మంది హాజరయ్యే అవకాశం ఉందనే సమాచారం వంటి వివరాలతో ముందస్తుగానే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సామర్థ్యానికి మించి టిక్కెట్లు, పాస్‌ల విక్రయాలు జరపకూడదని సీపీ తెలిపారు. వెహికిల్‌ పార్కింగ్‌ సమస్యలు వంటివి తలెత్తకుండా చూసుకోవాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. సౌండ్‌ బాక్స్‌లు, డీజేల వాడకంతో ఇబ్బంది తలెత్తకుండా నిర్ణీత మోతాదులోనే ఉండేలా చూసుకోవాలన్నారు. అశ్లీల డ్యాన్స్‌లు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లను వేడుకలకు అనుమతిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
న్యూ ఇయర్‌ వేడుకల్లో డ్రగ్స్ వాడకాన్ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాతో పాటుగా జైలు శిక్షకూడా తప్పదన్నారు. ఎవరైనా చట్టవిరుద్ధమైన వాటికి సహకరిస్తే కఠిన చర్యలు తప్పవనే హెచ్చరికలు జారీ చేశారు.