
హైదరాబాద్, అక్టోబర్ 25: అలయ్ బలయ్ ద్వారా దత్తాత్రేయ మంచి వేదికను పరిచయం చేశారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కులాలకు, రాజకీయాలకు, మతాలకు అతీతంగా ఒక వేదికగా మారిందన్నారు. ఈ వేదిక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక పోషించిందన్నారు. గత 17 ఏళ్లుగా దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
దత్తన్న పేరు ఇక నుంచి అలయ్ బలయ్ దత్తన్న అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, మీనాక్షి లేఖి, BRS MP K కేశవరావు, బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, VH, TJS అధ్యక్షులు ప్రొఫెసర్ కోదంరామ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరైయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి