Telangana: ఆ నంబర్ నుంచి మెసేజ్‌లొస్తే జాగ్రత్త: మంత్రి నిరంజన్ రెడ్డి

ఈ మేరకు మాట్లాడిన ఆయన, త‌న పేరిట వ‌చ్చే వాట్సాప్ మెసేజ్‌‌లపై ఉద్యోగులు, అధికారులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులతో ఎవరూ స్పందించొద్ద‌ని కోరారు.

Telangana: ఆ నంబర్ నుంచి మెసేజ్‌లొస్తే జాగ్రత్త: మంత్రి నిరంజన్ రెడ్డి
Minister Niranjan Reddy

Updated on: Dec 08, 2022 | 6:00 AM

Cyber Crime: సైబ‌ర్ నేర‌గాళ్లు నకిలీ నెంబ‌ర్లు, డీపీల‌తో అటు మొబైల్ నంబర్లతోనే కాదు, సోషల్ మీడియాలో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మోసంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిక్కుకున్నారు. ఈ మేరకు స్పందించిన ఆయన, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ మేరకు మాట్లాడిన ఆయన, త‌న పేరిట వ‌చ్చే వాట్సాప్ మెసేజ్‌‌లపై ఉద్యోగులు, అధికారులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులతో ఎవరూ స్పందించొద్ద‌ని కోరారు. ఎక్కువగా 9353849489 నంబ‌ర్ నుంచే మెసేజ్‌లు వస్తున్నాయని, అలాంటి ఫ్రాడ్ మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు.

ఆ నంబ‌ర్‌కు డబ్బులెవరూ పంపొద్దని కోరారు. ఇలాంటి నేరగాళ్లపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని నిరంజ‌న్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..