Congress: CWC సమావేశాలకు వేళాయే.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కీ ప్లాన్..! రెండు రోజుల షెడ్యూల్ ఇదే..

|

Sep 16, 2023 | 8:25 AM

CWC Meeting: హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సందడి మొదలైంది. కాంగ్రెస్‌ అతిరథ మహారథులంతా భాగ్యనగరానికి తరలివస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ హైదరాబాద్‌ రాబోతున్నారు. ఈ మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత శంషాబాద్‌లో ల్యాండ్‌కాబోతున్నారు రాహుల్‌గాంధీ..

Congress: CWC సమావేశాలకు వేళాయే.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కీ ప్లాన్..! రెండు రోజుల షెడ్యూల్ ఇదే..
CWC Meeting in Hyderabad
Follow us on

Congress Working Committee Meeting: హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సందడి మొదలైంది. కాంగ్రెస్‌ అతిరథ మహారథులంతా భాగ్యనగరానికి తరలివస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ హైదరాబాద్‌ రాబోతున్నారు. ఈ మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత శంషాబాద్‌లో ల్యాండ్‌కాబోతున్నారు రాహుల్‌గాంధీ. సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న కాంగ్రెస్‌ అతిరథ మహారధులకు డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలుకనున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్‌ అగ్రనేతల రాకతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతను కట్టుదిట్టంచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించారు. స్థానిక పోలీసులతోపాటు సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు నిఘా కళ్లతో పహారా కాస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్ర నేతలు ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటికి వచ్చేందుకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణా వేదికగా శనివారం, ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. రెండ్రోజులపాటు జరగనున్న సమావేశాల కోసం హోటల్‌ తాజ్‌కృష్ణలో భారీ ఏర్పాట్లు చేసింది టీపీసీసీ. సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాక.. తుక్కుగూడలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది కాంగ్రెస్‌. ఈ వేదిక నుంచే ఆరు గ్యారంటీ హామీలను ప్రకటించనున్నారు సోనియాగాంధీ. కాగా.. ఈ సభకు టీ కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 10 లక్షల మందిని తరలించాలని భావిస్తోంది. అందుకు తగినట్లుగా కేడర్‌ను సమాయత్తం చేసింది.

సీడబ్ల్యూసీ సమావేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మజిలీ ఎన్నికలు, ఇండియా కూటమి.. ప్రస్తుత రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం తీసుకోవాల్సిన చర్యలు.. తదితర అంశాలపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో దీనిలో కార్యచరణ రూపొందించనున్నట్లు సమాచారం.. అంతేకాకుండా ఇండియా కూటమిలో సీట్ల పంపకాల గురించి కూడా చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు..

అగ్రనేతల రాక.. సీడబ్ల్యూసీ షెడ్యూల్ ఇలా..

  • ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచి 12:30 మధ్య సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక రాక
  • మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చే లంచ్‌కు అటెండ్ కానున్న సీడబ్ల్యూసీ సభ్యులు.
  • మధ్యాహ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం..
  • రేపు ఉదయం 10:30కి ఎక్స్ టెండెడ్ సీడబ్ల్యూసీ సమావేశం..
  • సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ ఛీఫ్‌లు సీఏల్పీ నేతల హాజరు ..
  • రేపు సాయంత్రం 5 గంటలకు తుక్కగూడలో కాంగ్రెస్ విజయభేరీ సభ..
  • సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు‌, సీఏల్పీ నేతలు హాజరు..
  • సభలో ఆరు గ్యారెంటీ స్కీంల ప్రకటన ..
  • 18న ఎంపీలు మినహా సీడబ్ల్యూసీకి వచ్చిన మిగతా నేతలంతా నియోజకవర్గానికి ఓకరు చొప్పున బీఆర్ఎస్ పై ఛార్జిషీట్ విడుదల చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..