Chhattisgarh Encounter: శంషాబాద్‌ విమానాశ్రయంలో వీర జవానుకు నివాళులు అర్పించిన సీపీ సజ్జనార్‌

|

Apr 06, 2021 | 8:59 AM

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో వీరమరణ పొందిన శాఖమూరి మురళీకృష్ణ పార్థివ దేహం రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు..

Chhattisgarh Encounter: శంషాబాద్‌ విమానాశ్రయంలో వీర జవానుకు నివాళులు అర్పించిన సీపీ సజ్జనార్‌
Follow us on

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో వీరమరణ పొందిన శాఖమూరి మురళీకృష్ణ పార్థివ దేహం రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఇతర శాఖల అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని మురళీకృష్ణ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన వీర జవాన్‌ శాఖమూరి మురళీకృష్ణ పార్థివ దేహాన్ని సజ్జనార్‌ మోశారు.

అమరులైన వీరజవాన్ల కుటుంబ సభ్యులను, రాష్ట్ర ప్రభుత్వాలు, సీఆర్పీఎఫ్‌ అధికారులు అన్ని విధాలుగా ఆదుకుంటారని అన్నారు. నక్సలిజం సమసిసోయినా.. రెట్టింపు ఉత్సాహంతో పోరాడి వీర జవాన్ల ఆశయాన్ని నెరవేరుస్తామన్నారు. అనంతరం ప్రత్యేక వాహణంలో మురళృకృష్ణ పార్థివదేహాన్ని గుంటూరు జిల్లాలోని స్వస్థలానికి తరలించారు.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండర్‌ శాఖమూరి మురళీకృష్ణ(34) మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో అమరుడయ్యారు. శాఖమూరి రవి, విజయ దంపతులకు వెంకటమోహన్‌, మురళీకృష్ణ సంతానం. మురళీకృష్ణ 2010లో సీఆర్‌పీఎఫ్‌కు ఎంపికయ్యాడు. ఆయనకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఇటీవలే ఇంటి నిర్మాణం పూర్తిచేశారు. ఈ వేసవిలో వివాహం జరిపించేందుకు కుటుంబసభ్యులు సంబంధాలు చూస్తున్నారు. 2నెలల క్రితం ఇంటికి వచ్చిన మురళీకృష్ణ ఈ దఫా పెళ్లి చేసుకునేందుకు వస్తానని బంధువులు, స్నేహితులకు చెప్పాడు. ఇంతలోనే ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో మురళీకృష్ణ మృతి చెందినట్లు సీఆర్‌పీఎఫ్‌ అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

ఇవీ చదవండి: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో టెన్షన్‌ వాతావరణం.. రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించే అవకాశం.. అప్రమత్తమైన పోలీసులు..

Amit Shah: మావోయిస్టులకు అమిత్ షా వార్నింగ్.. గాయపడిన జవాన్లను పరామర్శించిన హోంమంత్రి