V Hanumantha rao on Hyderabad cricket association : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మీటింగ్ నుంచి అకస్మాత్తుగా వెనుదిరిగి వెళ్లిపోయారు. వెళుతూ వెళుతూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హెచ్ సి ఎ తీవ్ర అవినీతితో భ్రష్టు పట్టిపోయిందన్న ఆయన, జిల్లాలో క్రికెట్ అభివృద్ధి ధ్యాసే లేదని విమర్శించారు. తెలంగాణలోని ఒక్క జిల్లాలోనూ గ్రౌండ్, క్రికెట్ స్టేడియం లేదని వీహెచ్ ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ అభివృద్ధి చేసుకుంటున్నారు… ఇక్కడేమో ఉన్న నిధులన్నీ అపెక్స్ కౌన్సిల్ మాయం చేసింది అని హనుమంతరావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అంబుడ్స్ మెన్ ఎన్నికల్లోనూ పారదర్శకత లేదు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపక్ వర్మ ని అంబుడ్స్ మెన్ గా ఎలా నిర్ణయిస్తారు? అని వీహెచ్ నిలదీశారు. దీనిపై ప్రెసిడెంట్ అజార్ ని ప్రశ్నిస్తే ఎలాంటి స్పందన లేదని వీహెచ్ అన్నారు. హెచ్.సి.ఏ. ప్రెసిడెంట్ అజర్ కి అధికార పార్టీ అండదండలు వున్నాయి, అందుకే ఆయన ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అని వి హనుమంతరావు విరుచుకుపడ్డారు.
Read also : HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం రసాభాస, అజార్ మాటవినని క్లబ్ కార్యదర్శులు