కేసీఆర్‌పై ఫైర్ అయిన షబ్బీర్ అలీ

| Edited By:

Mar 21, 2019 | 4:17 PM

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా ప్రజల అజాభిప్రాయాన్ని గౌరవించకుండా..కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొన్నారంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పైరయ్యారు. నీకు దమ్ముంటే ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయ్‌. ప్రజాభిప్రాయమేంటో తెలుస్తుంది’’అని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఒక్కో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు రూ.25కోట్లు, కార్పొరేషన్‌ పదవులు, వీలైతే మంత్రి పదవి ఆశ చూపి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే ఫెడరల్‌ ఫ్రంట్‌ అన్న కేసీఆర్‌… పార్లమెంట్‌ ఎన్నికలొచ్చేసరికి జాతీయ […]

కేసీఆర్‌పై ఫైర్ అయిన షబ్బీర్ అలీ
Follow us on

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా ప్రజల అజాభిప్రాయాన్ని గౌరవించకుండా..కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొన్నారంటూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పైరయ్యారు. నీకు దమ్ముంటే ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయ్‌. ప్రజాభిప్రాయమేంటో తెలుస్తుంది’’అని సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఒక్కో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు రూ.25కోట్లు, కార్పొరేషన్‌ పదవులు, వీలైతే మంత్రి పదవి ఆశ చూపి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే ఫెడరల్‌ ఫ్రంట్‌ అన్న కేసీఆర్‌… పార్లమెంట్‌ ఎన్నికలొచ్చేసరికి జాతీయ పార్టీ స్థాపిస్తా అంటున్నాడని ఎద్దేవా చేశారు. ఇక్కడ మోదీని తిట్టే కేసీఆర్‌.. ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుంటారని విమర్శలు గుప్పించారు.