Kiraak RP Father: ఈయన కిర్రాక్ ఆర్పీ తండ్రి.. ఎందుకు కంటతడి పెట్టుకున్నారంటే..?

|

Jan 11, 2023 | 2:07 PM

ఎవరు ఎన్ని మాటలు అన్నా మళ్ళీ కష్టపడి పైకి వస్తాం అని కిర్రాక్ ఆర్పీ తండ్రి చెప్పారు. చేపల పులుసు చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Kiraak RP Father: ఈయన కిర్రాక్ ఆర్పీ తండ్రి.. ఎందుకు కంటతడి పెట్టుకున్నారంటే..?
Comedian Kiraak Rp Father
Follow us on

కమెడియన్ కిర్రాక్ ఆర్పీ హైదరాబాద్‌లో చేపల పులుసు దుకాణం తెరిచిన విషయం తెలిసిందే. నటనకు గ్యాప్ ఇచ్చి.. ఈ జబర్దస్త్ కమెడియన్ పెట్టిన బిజినెస్ బాగానే క్లిక్ అయ్యింది. ఉభయ రాష్ట్రాల్లో ఫేమస్ అయిన నెల్లూరు పులుసును అదే ఫ్లేవర్‌లో సిటీ జనాలకు అందించడంతో సక్సెస్ అయ్యాడు ఆర్పీ. దీంతో అతడి షాపుకు ఫిష్ కర్రీ ప్రియులు పోటెత్తారు. ఎంతలా అంటే.. మ్యాన్ పవర్ షార్టేజ్‌తో షాపు క్లోజ్ చేయాల్సినంత. అవును ఏకంగా షాపును ఒక వారం పాటు క్లోజ్ చేసి.. నెల్లూరు వెళ్లి.. చెఫ్ హంట్ చేశాడు ఆర్పీ. అక్కడ చేపల పులుసు చేయడంలో బాగా చేయి తిరిగిన మహిళలను హైదరాబాద్ తీసుకొచ్చి.. మళ్లీ షాపు రీ ఓపెన్ చేశాడు. ఆర్పీ కర్రీ పాయింట్‌లో స్పెషల్ ఏంటంటే.. అతడు చేపలతో పాటు అందులో వాడే మసాలా, మామిడికాయలు అన్నీ నెల్లూరు నుంచే తెప్పిస్తున్నాడు. ఇక వంట చేసే వాళ్లు కూడా అక్కడివాళ్లే. దీంతో టేస్ట్ అదిరిపోతుంది అన్న టాక్ వచ్చింది. దీంతో కస్టమర్స్ అక్కడికి తెగ వచ్చేస్తున్నారు.

కాగా చేపల పులుసు వండే సమయంలో.. పక్కనే ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు కిర్రాక్ ఆర్పీ తండ్రి. ఈ సందర్భంగా షాపు టెంపరరీగా మూసినప్పుడు.. తమను అనేక మాటలన్నారని ఆయన ఎమోషనల్ అయ్యారు. తమను గేలి చేసిన వారందరికీ బిజినెస్‌తోనే సమాధానం చెబుతామన్నారు. రోజుకు 300 కేజీలకు పైగానే చేపలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 4 నుండి పని ప్రారంభిస్తే రాత్రి 11 వరకు తమకు కర్రీ పాయింటే లోకమన్నారు.

ఒక్కోసారి పులుసు సరిగా రాకపోతే..  అది పక్కనే పెట్టేస్తాం కానీ జనాలకు అమ్మం అని ఆర్పీ తండ్రి తెలిపారు. నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడమన్నారు. ఇక జీతాలు మాస్టర్లకు, అసిస్టెంట్‌లకు అలా వేరుగా ఉంటాయని దాదాపు 40 వేల వరకు జీతం తీసుకుంటున్నవారు ఉన్నారని వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి