కోచింగ్ సెంటర్లలో డేంజర్ బెల్స్!

| Edited By:

May 29, 2019 | 7:38 PM

అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల స్టెప్పింగ్ స్టోన్ గా మారిన అమీర్‌పేట్‌లో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. మైత్రీవనంలో ఎటుచూసినా కోచింగ్ సెంటర్లే కనిపిస్తాయి. అమీర్‌పేట్, మైత్రీవనం, ఎస్.ఆర్.నగర్ లో దాదాపు వెయ్యికిపైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఏ కోచింగ్ సెంటర్ లోను ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడంలేదు. 20 మంది కెపాసిటీ ఉన్న రూముల్లో 50 మందిని కూర్చోబెడుతున్నారు. పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు. ఒక్క అమీర్‌పేట్ లోనే కాకుండా దిల్‌సుఖ్‌నగర్, అశోక్ […]

కోచింగ్ సెంటర్లలో డేంజర్ బెల్స్!
Follow us on

అమెరికా వెళ్లాలనుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల స్టెప్పింగ్ స్టోన్ గా మారిన అమీర్‌పేట్‌లో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. మైత్రీవనంలో ఎటుచూసినా కోచింగ్ సెంటర్లే కనిపిస్తాయి. అమీర్‌పేట్, మైత్రీవనం, ఎస్.ఆర్.నగర్ లో దాదాపు వెయ్యికిపైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఏ కోచింగ్ సెంటర్ లోను ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడంలేదు. 20 మంది కెపాసిటీ ఉన్న రూముల్లో 50 మందిని కూర్చోబెడుతున్నారు. పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే ఇక అంతే సంగతులు. ఒక్క అమీర్‌పేట్ లోనే కాకుండా దిల్‌సుఖ్‌నగర్, అశోక్ నగర్ లోని కోచింగ్ సెంటర్లలో కూడా ఇదే పరిస్థితి దాపురించింది. ఇటీవల సూరత్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ కోచింగ్ సెంటర్లపై అధికారులు దృష్టి సారించారు. కొన్ని సంస్థలకు నోటీసులు కూడా జారీ చేశారు. ఇతర వివరాలకోసం వీడియో చూడండి.