వినాయక చవితి అంటే.. తెలుగునాట ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేశుడే! ప్రతీ ఏటా తీరొక్క రూపంతో దర్శనమిస్తూ భక్తులను కరుణిస్తాడు ఖైరతాబాద్ గణనాథుడు! ఎన్ని సార్లు వెళ్లినా.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ముచ్చటగొలుపుతాడు. ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేషుడి ప్రస్థానం.. ఏటేటా పెరుగుతూ రావడమే కాదు.. ఆ ప్రాంతాన్ని ఓ దివ్యక్షేత్రంగా మార్చింది. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా ఎత్తు తగ్గించినప్పటికీ.. ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో దర్శనమిస్తున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు..
అయితే ఎన్నో ప్రత్యేకతలున్న ఓ మట్టి వినాయక ప్రతిమను ఖైరతాబాద్ మండపానికి పంపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఐదు అడుగుల మట్టి విగ్రహానికి పూజలు నిర్వహించాలంటూ సీఎం కేసీఆర్ భక్తులను కోరారు. ఎకో ఫ్రెండ్లీగా పండుగను నిర్వహించుకోవాలనే సందేశాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అందించారు.
వినాయకుడు గణపతి. ఆయన ఏ గణాలకు అధిపతి అయినా అసలు అధిపతిగా ఉండాల్సింది మాత్రం ప్రకృతి గణాలకే. అవి శక్తిమంతమయ్యి మనుషులకు శక్తి ఇవ్వాలి. అది కూడా ఈ వినాయక చవితి పండగ సందర్భంగా మనం కోరుకోవాలి.
ఖైరతాబాద్ లంబోదరుడికి గవర్నర్ ప్రత్యేక పూజలు
ఖైరతాబాద్ లంబోదరుడికి శుక్రవారం గవర్నర్ తమిళిసై దంపతులు తొలిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. స్వామివారికి 60 అడుగుల కండువా, జంధ్యం, గరికమాలను భారీ ఊరేగింపుగా తీసుకొచ్చి సమర్పించారు.
ఇవి కూడా చదవండి: Vinayaka Chavithi: ఎలాంటి విఘ్నాలు లేకుండా.. విఘ్నేశ్వరుడికి తొలిపూజ ఇలా చేద్దాం..
Vinayaka Chavithi: గణపయ్యకు అమ్మవారు ప్రాణం పోసింది ఇక్కడే.. ఈ దేవ భూమి చేరుకోవాలంటే..