Hyderabad: క్రికెట్ బెట్టింగ్ కు అడ్డాగా ఎల్బీ నగర్.. సీబీఐ దర్యాప్తులో సంచలనాలు

|

May 15, 2022 | 8:29 AM

ఐపీఎల్ 15(IPL-15) వ సీజన్ రసవత్తరంగా మారుతోంది. రోజురోజుకు ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ లతో అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు బెట్టింగ్ కు తెర లేపుతున్నారు.....

Hyderabad: క్రికెట్ బెట్టింగ్ కు అడ్డాగా ఎల్బీ నగర్.. సీబీఐ దర్యాప్తులో సంచలనాలు
Cricket Betting
Follow us on

ఐపీఎల్ 15(IPL-15) వ సీజన్ రసవత్తరంగా మారుతోంది. రోజురోజుకు ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ లతో అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు బెట్టింగ్ కు తెర లేపుతున్నారు. వందల నుంచి ప్రారంభమై, వేలు, లక్షలు, కోట్లు చేతులు మారుతున్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో బెట్టింగ్ పెడుతూ నిండా మునుగుతున్నారు. వినోదాన్ని పంచాల్సిన ఐపీఎల్ కొన్ని సందర్భాల్లో విషాదం నింపుతోంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఐపీఎల్ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న అంతరాష్ట్ర ముఠాలను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) గుర్తించింది. ఎల్బీనగర్‌(LB.Nagar) లోని స్టేట్‌బ్యాంక్‌ కాలనీ, మజీద్‌ లేన్‌ కాలనీలో ఉంటున్న గుర్రం సతీష్‌, గుర్రం వాసు బెట్టింగ్‌ రాకెట్‌లో కీలకపాత్ర పోషించారని సీబీఐ అధికారులు పక్కా సాక్ష్యాధారాలు సేకరించారు. ఎనిమిదేళ్లలో వీరిద్దరి ఖాతాల్లో రూ.9.95కోట్ల నగదు జమయ్యింది. సతీష్‌, వాసులపై సీబీఐ కేసు నమోదు చేసిందన్న సమాచారంతో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు గతంలో జరిగిన బెట్టింగ్‌ కార్యకలాపాల్లో వీరిద్దరున్నారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

గుర్రం సతీశ్.. పద్మశ్రీ కాంప్లెక్స్‌లో సాయి సెలెక్షన్‌ రెడీమేడ్‌ గార్మెంట్స్‌ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. షాపు పేరుతో ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంకుల్లో రెండు చొప్పున పదేళ్ల క్రితమే ఖాతాలు తెరిచాడు. ఇందులో రూ.4.50 కోట్లు ఢిల్లీ, రాజస్థాన్‌ రాష్ట్రాల నుంచి, రూ.3.05 లక్షలు విదేశాల నుంచి డిపాజిల్‌ అయ్యాయి. గుర్రం వాసు ఐసీఐసీఐ బ్యాంకులో మూడు ఖాతాలు తెరిచాడు. ఇతడి ఖాతాల్లోకి ఎనిమిదేళ్లలో రూ.5.37 కోట్లు జమయ్యాయి. ఒక వ్యక్తికి ఒకే బ్యాంకులో మూడు ఖాతాలు ఎలా ఉన్నాయని విచారించగా.. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని తేలింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

ఇవి కూడా చదవండి

Tomato Flu: టొమాటో ఫ్లూతో జాగ్రత్త.. చిన్న పిల్లలే దీని టార్గెట్‌..!