BRS: ‘పార్టీ మారే ఉద్దేశమే లేదు..’ సీఎం రేవంత్‌తో భేటిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ..

|

Jan 24, 2024 | 12:40 PM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ, పార్టీ మారుతారన్న ప్రచారంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. తాము ఎవరితోనూ చర్చలు జరపడంలేదని, ప్రొటోకాల్, ఎస్కార్ట్ ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశామన్నారు.

BRS: పార్టీ మారే ఉద్దేశమే లేదు.. సీఎం రేవంత్‌తో భేటిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ..
Brs Mlas Press Meet
Follow us on

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ, పార్టీ మారుతారన్న ప్రచారంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. తాము ఎవరితోనూ చర్చలు జరపడంలేదని, ప్రొటోకాల్, ఎస్కార్ట్ ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశామన్నారు. దాంతోపాటు ఉమ్మడి మెదక్‌జిల్లా సమస్యలపై చర్చించామని ఆమె తెలిపారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తామన్నారు. తమకు పార్టీ మారే ఉద్దేశం తమకు లేదని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు సునీతా లక్ష్మారెడ్డి.

మా నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి. కాంగ్రెస్‌లో చేరుతున్నామనే ప్రచారాన్ని ఖండించారు. గతంలో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ సమస్యలపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిశానన్నారు. అదే విధంగా దుబ్బాక సమస్యలపై సీఎం, మంత్రులను కూడా కలిశామన్నారు. ఇందులో తప్పేముందని ప్రశ్నించారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి.

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మంగళవారం ఇంటెలిజెన్స్​చీఫ్​శివధర్‌రెడ్డిని కలిసి ప్రొటోకాల్​ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి పదవులు లేని నాయకులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, రాజ్యాంగం కల్పించిన ప్రొటోకాల్ హక్కును ఉల్లంఘిస్తే రాజకీయ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారిక కార్యక్రమాలకు పోలీస్ ఎస్కార్ట్ తొలగిస్తున్నారని, వెంటనే ఈ అంశాలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తానికి సీఎం రేవంత్‌ను కలవడంతో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే వార్తలు దుమారం రేపడంతో వివరణ ఇచ్చారు.