Hyderabad: టాలీవుడ్ హీరో నితిన్‌తో భేటీ అవ్వనున్న జేపీ నడ్డా.. బీజేపీ స్ట్రాటజీ ఏంటి..?

| Edited By: Phani CH

Aug 27, 2022 | 11:36 AM

ఇటీవలే అమిత్ షా ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. తాజాగా జేపీ నడ్డా నితిన్‌తో డిన్నర్ చేయనున్నారు. దీని వెనుక బీజేపీ స్ట్రాటజీ ఏంటన్నది అంతుచిక్కడం లేదు.

Hyderabad: టాలీవుడ్ హీరో నితిన్‌తో భేటీ అవ్వనున్న జేపీ నడ్డా.. బీజేపీ స్ట్రాటజీ ఏంటి..?
Jp Nadda Nithiin
Follow us on

JP Nadda HYD Tour: శనివారం తెలంగాణలో బీజేపీ జాతియ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) టూర్‌ ఉండనున్న విషయం తెలిసిందే. హన్మకొండ(Hanamkonda)లో జరగనున్న ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించనున్నారు.  ఈ క్రమంలో తాజాగా ఓ బ్రేకింగ్ అందుతుంది. శనివారం ఉదయం భారత మాజీ క్రికెట్ ప్లేయర్ మిథాలీ రాజ్‌తో భేటీ అవ్వనున్న ఆయన… రాత్రికి హైదరాబాద్ నోవోటెల్‌లో టాలీవుడ్‌ హీరో నితిన్‌తో నడ్డా భేటీ అవ్వనున్నారు. కాగా ఇటీవల హీరో ఎన్టీఆర్‌తో కేంద్ర హోమంత్రి అమిత్‌షా భేటీ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌ హీరోలతో బీజేపీ నేతల వరుస భేటీలు ప్రాధాన్యత సంతరించుకుంది. వాళ్ల ప్లానింగ్, స్ట్రాటజీ ఏంటన్నది అర్థం కావట్లేదు.

శనివారం ఉదయం సతీ సమేతంగా హైదరాబాద్‌కు రాబోతున్నారు నడ్డా. 12 గంటలకు ల్యాండ్‌ అవనున్నారు. పార్టీ ముఖ్యనేతలతో భేటీ తర్వాత క్రికెటర్‌ మిథాలీరాజ్‌తో సమావేశం జరగనుంది. ఆ భేటీ తర్వాత హెలీకాఫ్టర్‌లో నేరుగా వరంగల్‌ వెళ్తారు నడ్డా. అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం సభకు హాజరుకానున్నారు. సాయంత్రం 6 గంటలకు సభ అనంతరం హెలీకాఫ్టర్లో హైదరాబాద్‌ చేరుకుంటారు. ఇక్కడ నోవోటెల్‌లో హీరో నితిన్‌తో భేటీ అవుతారు. అనేక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కొందరు సినీ రచయితలతోనూ ఆయన సమావేశం కానున్నారు. శనివారం రాత్రికి నడ్డా హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి