Amit Shah Hyderabad Visit: రాజకీయం చేస్తున్నారు.. దేశ ప్రజలు వాళ్లను క్షమించరు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

|

Sep 17, 2023 | 12:15 PM

Telangana Liberation Day 2023 highlights: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా కేంద్రం నిర్వహించిన విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొదట వార్ మెమోరియల్ దగ్గర అమర జవాన్లకు నివాళులర్పించి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Amit Shah Hyderabad Visit: రాజకీయం చేస్తున్నారు.. దేశ ప్రజలు వాళ్లను క్షమించరు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
Amith Shah 002

Telangana Liberation Day 2023 highlights: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా కేంద్రం నిర్వహించిన విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మొదట వార్ మెమోరియల్ దగ్గర అమర జవాన్లకు నివాళులర్పించి.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు.. దేశ ప్రజలు వాళ్లను క్షమించరు అంటూ పేర్కొన్నారు. స్వాతంత్ర్యపోరాటాన్ని కూడా కాంగ్రెస్‌ వక్రీకరించిందన్నారు. భవిష్యత్‌ తరాలకు తెలంగాణ విమోచన చరిత్ర తెలియాలి.. అంటూ పేర్కొన్నారు. సర్దార్‌ పటేల్‌ కృషి తోనే తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ పోరాట చరిత్రను వక్రీకరించారన్న అమిత్‌ షా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మోదీ ఆ పొరపాటును సరిచేశారని ప్రశంసించారు. మోడీ 9 ఏళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ది సాధించిందని.. భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పిందని అమిత్ షా తెలిపారు.

పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవానికి కమల దండు భారీగా తరలివచ్చింది. మైదానం మొత్తం కాషాయమయం అయ్యింది.

లైవ్ వీడియో..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 17 Sep 2023 11:13 AM (IST)

    షోయబుల్లా ఖాన్, రాంజీ గోండు పోస్టల్ కవర్ ఆవిష్కరణ

    పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా .. సాయుధ బలగాల కోసం 80 ఎకరాల స్థలంలో నిర్మించిన స్వశస్త్ర సీమా బల్ క్వార్టర్లను వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే షోయబుల్లా ఖాన్, రాంజీ గోండు పోస్టల్ కవర్ ఆవిష్కరించారు.

  • 17 Sep 2023 10:48 AM (IST)

    తెలంగాణ విమోచన చరిత్ర తెలియాలి

    తెలంగాణ విమోచన దినాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు.. దేశ ప్రజలు వాళ్లను క్షమించరు అంటూ అమిత్‌షా పేర్కొన్నారు. స్వాతంత్ర్యపోరాటాన్ని కూడా కాంగ్రెస్‌ వక్రీకరించిందన్నారు. భవిష్యత్‌ తరాలకు తెలంగాణ విమోచన చరిత్ర తెలియాలి.. అంటూ పేర్కొన్నారు.


  • 17 Sep 2023 10:40 AM (IST)

    చరిత్రను వక్రీకరించారు..

    9 ఏళ్ల మోడీ పాలనలో కేంద్ర ప్రభుత్వం భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పామని అమిత్ షా తెలిపారు. చంద్రయాన్ సక్సెస్, జీ20 సమ్మిట్ విజయవంతం అయిందని గుర్తుచేశారు. గతంలో చరిత్రను వక్రీకరించారని.. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పులను మోడీ సరిద్దారని తెలిపారు. మోడీ పుట్టినరోజు నాడు సేవా దివస్ గా జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర చరిత్రను వక్రీకరించిన కాంగ్రెస్ ను క్షమించరని ఫైర్ అయ్యారు.

  • 17 Sep 2023 10:37 AM (IST)

    మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ది..

    నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సవరణలు చేపట్టి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని అమిత్ షా పేర్కొన్నారు. మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ది పథంలో దూసుకెళ్తుందన్నారు.

  • 17 Sep 2023 10:33 AM (IST)

    పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి లభించేది కాదు..

    సర్ధార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి లభించేది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారు. పటేల్, కేఎం మున్షి వల్లే నిజాం పాలన అంతం అయిందని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధులకు ఈ సందర్భంగా వందనాలు తెలిపారు.

  • 17 Sep 2023 10:27 AM (IST)

    ఎందరో బలిదానాలతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం

    ఎందరో బలిదానాల వల్లే తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలలు ఆలస్యంగా తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. రజాకార్లు తెలంగాణ ప్రజలను పీడించారని వివరించారు.

  • 17 Sep 2023 10:25 AM (IST)

    హైదరాబాద్‌కు ఇవాళ విముక్తి లభించిన రోజు

    తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. హైదరాబాద్‌కు ఇవాళ విముక్తి లభించిన రోజు.. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. విముక్తి పోరాటంలో పాల్గొన్న యోధులకు వందనాలు అంటూ అమిత్‌షా నివాళులర్పించారు.

  • 17 Sep 2023 09:53 AM (IST)

    ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

    రు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్‌ గ్రౌండ్‌లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. బతుకమ్మ ఆటపాట, కోయనృత్యాలు, డప్పు కళాకారుల ప్రదర్శనలు, బోనాలు, పోతురాజుల విన్యాసాలు, ఉగ్గు కళాకారుల ప్రదర్శనలను అమిత్ షా తిలకించారు.

  • 17 Sep 2023 09:26 AM (IST)

    గౌరవవందనం స్వీకరించిన అమిత్ షా

    తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించి భద్రతా బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రజలకు అభివాదం చేశారు.

  • 17 Sep 2023 09:24 AM (IST)

    సర్ధార్ వల్లభాయ్ పటేల్‌‌కు నివాళులు

    తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా అమిత్ షా.. సర్ధార్ వల్లభాయ్ పటేల్‌‌కు నివాళులు అర్పించారు.

  • 17 Sep 2023 09:22 AM (IST)

    జాతీయ జెండాను ఆవిష్కరించిన అమిత్ షా..

    హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవవందనం చేసి.. జాతీయ గీతాన్ని ఆలపించారు.

  • 17 Sep 2023 09:10 AM (IST)

    వార్ మెమోరియల్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించిన కేంద్రమంత్రి అమిత్ షా..

  • 17 Sep 2023 09:07 AM (IST)

    అమరవీరులకు అమిత్ షా నివాళులు

    CRPF సెక్టార్‌ నుంచి అమిత్‌ షా పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వార్‌ మెమోరియల్‌ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించారు.

  • 17 Sep 2023 08:58 AM (IST)

    పరేడ్‌గ్రౌండ్‌కు బయలుదేరిన అమిత్ షా..

    మరికాసేపట్లో అమిత్ షా CRPF సెక్టార్‌ నుంచి పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా మొదటగా వార్‌ మెమోరియల్‌ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పిస్తారు.

  • 17 Sep 2023 08:36 AM (IST)

    మరికాసేపట్లో పరేడ్ గ్రౌండ్‌కు అమిత్ షా

    CRPF సెక్టార్‌ నుంచి పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకున్న తర్వాత అమిత్‌ షా.. వార్‌ మెమోరియల్‌ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు.

  • 17 Sep 2023 08:35 AM (IST)

    పోలీసుల తనిఖీలు

    అమిత్ షా పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్ చుట్టూ CRPF బలగాలను మోహరించారు. పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఉన్న రైల్వేస్టేషన్ బస్‌స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. సికింద్రాబాద్‌ పరిధిలోని హోటల్‌, లాడ్జిలలో పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.

  • 17 Sep 2023 08:34 AM (IST)

    భారీ బందోబస్తు

    తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో అమిత్ షా పరేడ్ గ్రౌండ్ కు చేరుకోనున్నారు.

  • 17 Sep 2023 07:59 AM (IST)

    అమిత్‌ షాతో బ్యాడ్మింటన్ స్టార్‌ పీవీ సింధు భేటీ

    బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశారు. హైదరాబాద్‌ వచ్చిన అమిత్‌ షా సంపర్క్​ సే సంవర్ధన్‌​లో భాగంగా సింధుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీవీ సింధు క్రీడా ప్రతిభ దేశానికే గర్వకారణం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. సింధు నిబద్ధత, కఠోర శ్రమ దేశ యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.. కెరీర్ లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ అమిత్ షా… సింధుకు ఆశీస్సులు అందించారు. ఈ భేటీలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, సింధు తండ్రి వెంకటరమణ పాల్గొన్నారు.

  • 17 Sep 2023 07:44 AM (IST)

    అమరులకు నివాళులు.. అమిత్ షా ట్వీట్

    హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ, హైదరాబాద్-కర్ణాటక & మరాఠ్వాడా ప్రాంత ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు హైదరాబాద్ ప్రజల దేశభక్తిని సూచిస్తుంది.. నిజాం దౌర్జన్య పాలన, ఆధిపత్యం నుంచి విముక్తిపొందడానికి.. వారి అలుపెరగని పోరాటాన్ని స్మరించుకుంటుంది. హైదరాబాద్ ముక్తి సంగ్రామంలో అమరవీరులైన వారికి నివాళులర్పిస్తున్నాను.. అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.

  • 17 Sep 2023 07:41 AM (IST)

    ముమ్మాటికీ విమోచన దినోత్సవమే: కిషన్‌రెడ్డి

    తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఆయన.. చరిత్రను మరుగుపరిచే కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమమైన తెలంగాణ విముక్తి పోరాటం.. ముమ్మాటికీ విమోచన దినోత్సవమే అంటూ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Follow us on