హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో అతిపెద్ద ఫుడ్‌ కోర్ట్‌

మొఘలాయ్‌ రుచుల కోసం ఒక చోటకు… బిర్యానీ తినాలంటే మరో చోటకు.. కాంటినెంటల్‌ డిషెస్‌ను టేస్ట్‌ చేయడానికి ఇంకో చోటకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇండియన్‌, చైనీస్‌, కాంటినెంటల్‌, అమెరికన్‌… డిష్‌ మీరు ఎంచుకోండి. అది మేం సర్వ్‌ చేస్తామంటూ దాదాపు 63కు పైగా విభిన్నమైన ఫుడ్‌ కౌంటర్లు ఒకే దరికి వచ్చాయి. కొండాపూర్‌లోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లో హైదరాబాద్‌లోనే అతిపెద్ద ఫుడ్‌ కోర్ట్‌ను ఏర్పాటు చేసింది యాపిల్‌ రెస్టారెంట్స్‌. ఆదివారం ఉదయం ఈ ఫుడ్‌కోర్టును […]

హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో అతిపెద్ద ఫుడ్‌ కోర్ట్‌

Edited By:

Updated on: Apr 15, 2019 | 10:21 AM

మొఘలాయ్‌ రుచుల కోసం ఒక చోటకు… బిర్యానీ తినాలంటే మరో చోటకు.. కాంటినెంటల్‌ డిషెస్‌ను టేస్ట్‌ చేయడానికి ఇంకో చోటకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇండియన్‌, చైనీస్‌, కాంటినెంటల్‌, అమెరికన్‌… డిష్‌ మీరు ఎంచుకోండి. అది మేం సర్వ్‌ చేస్తామంటూ దాదాపు 63కు పైగా విభిన్నమైన ఫుడ్‌ కౌంటర్లు ఒకే దరికి వచ్చాయి. కొండాపూర్‌లోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లో హైదరాబాద్‌లోనే అతిపెద్ద ఫుడ్‌ కోర్ట్‌ను ఏర్పాటు చేసింది యాపిల్‌ రెస్టారెంట్స్‌.

ఆదివారం ఉదయం ఈ ఫుడ్‌కోర్టును ఏషియన్‌ సినిమాస్‌ అధినేత నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, యాపిల్‌ రెస్టారెంట్స్‌ డైరెక్టర్‌ రఘురామ్‌ రెడ్డి, శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌ ప్రమోటర్‌ శరత్‌ గోపాల్‌ బొప్పన, సినీ నిర్మాతలు సురేష్‌ బాబు, కళ్యాణ్‌ తదితరుల సమక్షంలో ప్రారంభించారు. అంతర్జాతీయంగా విభిన్న రుచులను ఒకే చోట అందించే ప్రయత్నం ఈ ఫుడ్‌ కోర్ట్‌. మాల్‌లోని నాల్గవ ఫ్లోర్‌లో 38 ఫుడ్‌ కౌంటర్లు ఉంటే, లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 25 ఫుడ్‌ కౌంటర్లు ఉన్నాయి.