Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8 ఫినాలే.. ఓవర్ చేస్తే తోలు తీస్తామని పోలీసుల వార్నింగ్
స్టార్ మా టీవీలో ప్రసారమైన ప్రముఖ తెలుగు రియాల్టీ షో 'బిగ్ బాస్-8' దాదాపు 100 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన తర్వాత నేటితో ముగియనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీజన్ విజేత ఎవరో గ్రాండ్ ఫినాలేలో ప్రకటించనున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. స్టూడియోస్ బయట భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. విన్నర్‌ని ప్రకటించిన తరువాత అంతా బయటకు వచ్చే అవకాశం ఉండటంతో.. వాళ్లని చూసేందుకు చాలామంది అన్నపూర్ణ స్టుడియో వద్దకు చేరుకుంటున్నారు. దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అలర్ట్ అయ్యారు పోలీసులు. ఈవెంట్ పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున జనాలు గుమిగూడి ఉండటం, ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అభిమానులు ఎవరూ ఇక్కడికి రావొద్దని పోలీసు అధికారులు తెలిపారు. ఎలాంటి న్యూసెన్స్ జరిగినా బాధ్యత మీదే అంటూ బిగ్ బాస్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గతంలో గత సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ షో నుంచి బయటికొచ్చిన సమయంలో కారుపై రాళ్లు విసరడం, తొక్కిసలాటలు, ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం వంటి సంఘటనలు జరిగాయి. దీంతో ఈసారి పోలీసులు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఏర్పాట్లను వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కాగా ఈ సీజన్ ప్రైజ్‌మనీ రూ.55 లక్షలు. గెలిచిన వారికి టైటిల్‌తోపాటు ఈ క్యాష్ ప్రైజ్ ఇవ్వనున్నారు. గౌతమ్, నిఖిల్ ఇద్దరిలో ఒకరు విజేత అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విన్నర్ విషయంలో బిగ్ బాస్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..