అయ్యో దేవుడా.. మరో నాలుగు రోజుల్లో బక్రీద్.. గొర్రెల మేత కోసం వెళ్లిన అన్నదమ్ములు.. ఇంతలోనే

పండగను సంబరంగా చేసుకుందామని ఆశపడిన ఆ కుటుంబానికి చేదు జ్ఞాపకాలు మిగిలాయి. మరో నాలుగు రోజుల్లో తమవారితో కలిసి సరదాగా పండగ చేసుకుని గడుపుదామనుకున్న ఆ ఇద్దరు అన్నదమ్ములు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పైగా ఒకే ఇంటి నుంచి సొంత అన్నదమ్ములు ఒకేసారి మృత్యువాత పడడం ఆ కుటుంబాన్ని కలచివేస్తోంది.

అయ్యో దేవుడా.. మరో నాలుగు రోజుల్లో బక్రీద్.. గొర్రెల మేత కోసం వెళ్లిన అన్నదమ్ములు.. ఇంతలోనే
Crime News

Edited By:

Updated on: Jun 03, 2025 | 5:30 PM

పండగను సంబరంగా చేసుకుందామని ఆశపడిన ఆ కుటుంబానికి చేదు జ్ఞాపకాలు మిగిలాయి. మరో నాలుగు రోజుల్లో తమవారితో కలిసి సరదాగా పండగ చేసుకుని గడుపుదామనుకున్న ఆ ఇద్దరు అన్నదమ్ములు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. పైగా ఒకే ఇంటి నుంచి సొంత అన్నదమ్ములు ఒకేసారి మృత్యువాత పడడం ఆ కుటుంబాన్ని కలచివేస్తోంది. హైదరాబాద్ నగరం యాకుత్‌పురా రైల్వేస్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అసలేం జరిగింది? ఎలా జరిగింది? అనే పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మరో నాలుగు రోజుల్లో బక్రీద్ పండగ ఉండడంతో ఆ కుటుంబం కుర్బానీ కోసం గొర్రెలను తెచ్చుకున్నారు. అయితే.. ఆ గొర్రెల కోసం మేత కావాలి కదా.. అని.. మేత తేవడానికి ఆ కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములు షాబుద్దీన్(26), ఫైజాన్(21) బయటి ప్రాంతానికి వెళ్లారు. గొర్రెల మేత కోసం ఆ ఇద్దరూ చెట్టు ఎక్కారు. ఇంతలో ఉన్నట్లుండి ఏం జరిగిందో మరి.. ఆ చెట్టు కొమ్మ విరిగి అక్కడే ఉన్న రైలు పట్టాలపై ఆ ఇద్దరు అన్నదమ్ములు పడిపోయారు. అదే సమయంలో ఆ మార్గంలో రైలు వెళ్తుండడంతో అది ఢీకొని ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే చనిపోయారు. యాకుత్‌పురా రైల్వేస్టేషన్‌లో జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

పండుగ కొద్ది రోజుల్లో ఉందనగా.. గొర్రెల మేత కోసం వెళ్లి అన్నదమ్ములు ఇలా మృత్యువాత పడడంతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. షాబుద్దీన్‌కు అప్పటికే పెళ్లయి ఉండగా.. ఫైజాన్‌కు ఇంకా పెళ్లి కావాల్సి ఉంది. బక్రీద్ పండుగ మరో నాలుగు రోజులు ఉందనగా.. ఒకే ఇంటికి చెందిన సొంత అన్నదమ్ములు చనిపోవడం తీవ్ర విషాదంలో మునిగేలా చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us