Hyderabad: హైదరాబాద్‌‌కు మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్.. ఎయిర్‌పోర్టులో అధికారుల ఘన స్వాగతం!

హైదరాబాద్‌ వేదికగా 2025 మిస్ వరల్డ్ పోటీల నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 7 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో ఈ ప్రతిష్ఠాత్మక పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఈ క్రమంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌ చేరుకున్న మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌, సీఈవో జూలియా ఈవేలిన్‌ మోర్లీకి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు.

Hyderabad: హైదరాబాద్‌‌కు మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్.. ఎయిర్‌పోర్టులో అధికారుల ఘన స్వాగతం!
Julia Morley

Updated on: May 02, 2025 | 10:28 AM

హైదరాబాద్‌ వేదికగా 2025 మిస్ వరల్డ్ పోటీల నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 7 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో ఈ ప్రతిష్ఠాత్మక పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది. అయితే ఈ పోటీల్లో మొత్తం 120 దేశాలకు చెందిన యువతులు పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాదులో జరగనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు.. లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో జూలియా మోర్లీకి అధికారులు సాంప్రదాయపద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలోని అద్భుత వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చూపించడానికి ఇదో గొప్ప వేదిక అవుతుందన్నారు.

వీడియో చూడండి..

ఇక రేపటి నుంచే ఈ మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లను జూలియా సమీక్షించనున్నారు. మిస్ వరల్డ్ కాంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాలలో చేపట్టిన ఏర్పాట్లును ఆమె పరిశీలించనున్నారు , వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లి సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..