శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి.. సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిరుమల బ్రహ్మోత్సవాలలకు రావాల్సింందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు ఏపీ సీఎం జగన్. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక ఆహ్వాన పత్రికను సైతం ఆయనకు అందజేశారు. శ్రీశైలానికి గోదావరి జిలాలు తరలింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఇరువురు ముఖ్యమంత్రులు ప్రగతి భవన్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాన అంశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి విషయంలో అనుసరిస్తున్న విధానాలపై ఇరువురు చర్చించారు. ఈ భేటీలో భాగంగానే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి […]

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి.. సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

Edited By:

Updated on: Sep 23, 2019 | 11:41 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిరుమల బ్రహ్మోత్సవాలలకు రావాల్సింందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు ఏపీ సీఎం జగన్. దీనికి సంబంధించి ఓ ప్రత్యేక ఆహ్వాన పత్రికను సైతం ఆయనకు అందజేశారు.

శ్రీశైలానికి గోదావరి జిలాలు తరలింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఇరువురు ముఖ్యమంత్రులు ప్రగతి భవన్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాన అంశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి విషయంలో అనుసరిస్తున్న విధానాలపై ఇరువురు చర్చించారు. ఈ భేటీలో భాగంగానే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావల్సింందిగా సీంఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు ఏపీ సీఎం జగన్.

ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందించిన వారిలో ఏపీ సీఎంతో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి కూడా ఉన్నారు. ‌