Ex MLA Son Case: పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో మరో ట్విస్ట్.. బోధన్ సీఐ అరెస్ట్.. నెక్స్ట్ ఎవరు..?

|

Jan 28, 2024 | 6:58 PM

పంజాగుట్ట హిట్ అండ్ రన్ కేసును పోలీసు అధికారులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సోహైల్.. దేశం దాటడంలో అధికారులు సాయపడినట్టు తెలుస్తోంది. తాజాగా బోధన్ సీఐని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Ex MLA Son Case: పంజాగుట్ట ర్యాష్ డ్రైవింగ్ కేసులో మరో ట్విస్ట్.. బోధన్ సీఐ అరెస్ట్.. నెక్స్ట్ ఎవరు..?
Crime News
Follow us on

పంజాగుట్ట హిట్ అండ్ రన్ కేసును పోలీసు అధికారులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సోహైల్.. దేశం దాటడంలో అధికారులు సాయపడినట్టు తెలుస్తోంది. తాజాగా బోధన్ సీఐని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీల్ కుమారుడు విదేశాలకు పారిపోవడానికి సహకరించిన బోధన్ సీఐ ప్రేమ్‌కుమార్‌తో పాటు మరో అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పంజాగుట్ట ప్రజా భవన్ దగ్గర యాక్సిడెంట్‌ తరువాత సోహైల్‌ను పంజాగుట్ట ఠానాకు కానిస్టేబుల్స్‌ తరలించారు. అంతలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కానీ పోలీస్ స్టేషన్ లో ఏ మంత్రాంగం జరిగిందో ఏమో కానీ సోహైల్ బదులు షకీల్ ఇంట్లో పని మనిషిని కేసులో చేర్చారు పోలీసులు. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే కుమారుడు విదేశాలకు ఎగిరిపోయాడు.

ఈ వ్యవహారంలో సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు చేపట్టారు పోలీస్‌ అధికారులు. అలాగే సోహైల్‌తో రాత్రి కాల్స్ మాట్లాడిన స్నేహితులను ఎంక్వయిరీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేమ్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.

రోడ్డు ప్రమాదం తరువాత మాజీ ఎమ్మెల్యే కుమారుడు దేశం దాటడంలో సహకరించిన పోలీసు అధికారుల్లో బోధన్ సీఐ ప్రేమ్ కుమార్ హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు.. సీఐని అరెస్ట్ చేసి.. విచారణ జరుపుతున్నారు. విచారణ తర్వాత కూడా మరికొంత మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..