Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంకెన్ని రోజులు కురుస్తాయి..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంకెన్ని రోజులు కురుస్తాయి..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..
Telangana and Andhra Pradesh Weather Update

Updated on: Feb 26, 2026 | 2:06 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దక్షిణ అంతర కర్ణాటక దక్షిణ ప్రాంతాలు, పరిసర ప్రాంతాలలోని నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. దక్షిణ అంతర కర్ణాటక నుండి మరాఠ్వాడ మహారాష్ట్ర వరకు ఉన్న ద్రోణి ఈరోజు ఉత్తర అంతర కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది.

వీటితోపాటు.. ఆంధ్రప్రదేశ్ & యానాంపై దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య / ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం

గురువారం తేలికపాటినుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురసే అవకాశముంది.

శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ – రాయలసీమ:-

గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

గమనిక :- రాగల 3 రోజుల్లో కోస్తాంద్ర – రాయలసీమలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు:

నిన్న వాయువ్య తమిళనాడు నుండి మధ్య మహారాష్ట్ర వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి ఉత్తర అంతర్గత కర్నాటక మీదుగా మరాఠ్వాడ ప్రాంతం వరకు సగటు సముద్రం మట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. గురువారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

శుక్రవారం, శనివారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us