
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మండీ రెస్టారెంట్ అమీర్‌పేట్ సహా నగరంలోని అన్ని బ్రాంచుల్లో ప్రమోషన్‌లో భాగంగా ఒక వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. మహిళలకు మాత్రమే పూర్తిగా ఉచితంగా బిర్యానీ మండి ఇస్తామని సోషల్ మీడియాలోప్రచారం చేసింది. ప్రీ మండి అనడంతో అమీర్‌పేట్ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది మహిళలు, యువత రెస్టారెంట్‌కు చేరుకున్నారు. దీంతో అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కింద ఉన్న ఈ రెస్టారెంట్ వద్ద భారీగా జనం గుమిగూడారు.
ఇక జనాలు భారీగా రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో రెస్టారెంట్ సిబ్బంది ఆఫర్ లేదని తలుపులు మూసివేపినట్టు తెలుస్తోంది.ఇక ఉచిత ఆఫర్ కోసం వచ్చి ఎండలో గంటల తరబడి వేచి ఉన్న జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ యాజమాన్యంతో గొడవకు దిగారు. అయితే కొందరు కస్టమర్లు ఇక్కడికి వచ్చాక ఆఫర్ లేదని రెస్టారెంట్ సిబ్బంది చెబుతున్నట్టు ఆరోపించారు. రెస్టారెంట్ పేరు మార్చి కస్టమర్స్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలు ఏం జరిగిందే ఈ వీడియోలో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.