అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మెట్రో మార్గాన్ని ప్రారంభించిన గవర్నర్

హైదరాబాద్‌ : అమీర్‌పేట్‌-హైటెక్‌ సిటీ మెట్రో రైల్‌ మార్గం అందుబాటులోకి వచ్చింది. అమీర్‌పేట్‌ ఇంటర్‌ఛేంజ్‌ మెట్రోస్టేషన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 10కి.మీ మార్గంలో అమీర్‌పేట్‌తో కలిపి 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. మధురానగర్‌ స్టేషన్‌కు తరుణి మెట్రో స్టేషన్‌గా నామకరణం చేశారు. పూర్తయిన రెండు కారిడార్లతో కలిపి మొత్తం 56కి.మీ మేర మెట్రో […]

అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మెట్రో మార్గాన్ని ప్రారంభించిన గవర్నర్

Edited By:

Updated on: Mar 20, 2019 | 10:16 AM

హైదరాబాద్‌ : అమీర్‌పేట్‌-హైటెక్‌ సిటీ మెట్రో రైల్‌ మార్గం అందుబాటులోకి వచ్చింది. అమీర్‌పేట్‌ ఇంటర్‌ఛేంజ్‌ మెట్రోస్టేషన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 10కి.మీ మార్గంలో అమీర్‌పేట్‌తో కలిపి 9 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. మధురానగర్‌ స్టేషన్‌కు తరుణి మెట్రో స్టేషన్‌గా నామకరణం చేశారు. పూర్తయిన రెండు కారిడార్లతో కలిపి మొత్తం 56కి.మీ మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో హడావుడి లేకుండా మెట్రో ప్రారంభోత్సవం జరిగింది. మెట్రో రైలు ప్రారంభోత్సవంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.