Hyderabad: బంగ్లాదేశ్‌ పరిణామాలతో హైదరాబాద్‌లో హై అలర్ట్

|

Aug 10, 2024 | 12:22 AM

బంగ్లాదేశ్‌ పరిణామాలతో అలర్ట్‌ అయ్యారు హైదరాబాద్‌ పోలీసులు. ఏ ఒక్కరూ నగరంలోకి రాకుండా నిఘా పెంచారు. ఇంతకు పోలీసులు అమలు చేస్తున్న యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి..?

Hyderabad:  బంగ్లాదేశ్‌ పరిణామాలతో హైదరాబాద్‌లో హై అలర్ట్
Hyderabad
Follow us on

బంగ్లా పరిణామాలతో హైదరాబాద్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు పోలీసులు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో… పెద్దఎత్తున ఆ దేశీయులు హైదరాబాద్‌కి ప్రవేశిస్తున్నారన్న సమాచారంతో మరింత అప్రమత్తమయ్యారు. బాలాపూర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి, పహడీషరీఫ్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణ డీజీపీ జితేందర్‌ సైతం అక్రమ వలసల విషయంలో ఫుల్‌ సీరియస్‌గా ఉన్నారు. హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు డీజీపీ జితేందర్.

హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాలకు చాలా కాలంగా బంగ్లాదేశ్‌ నుంచి పలువురు అక్రమంగా వస్తున్నారు. రెండు నెలల క్రితం కోల్‌కతా నుంచి ఖమ్మం చేరిన బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు మైనర్లను.. ఆపరేషన్‌ మస్కాన్‌లో పట్టుకున్నారు. కాగా ఇటీవల సికింద్రాబాద్‌లోనూ ఓ మైనర్‌ సహా ఐదుగురి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇప్పుడు బంగ్లాలో పరిస్థితులు అస్సలు బాగలేకపోవడం… పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటంతో పోలీసులు నిఘా పెంచారు. నగరానికి వచ్చే వారిపైనే కాకుండా… హైదరాబాద్‌లో స్థిరపడ్డ బంగ్లాదేశీయులపైనా ఫోకస్‌ పెట్టారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు ముమ్మరం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..