Hyderabad: హైదరాబాద్‌లో మూడు చోట దారుణ హత్యలు.. ఎక్కడెక్కడ అంటే

|

Jun 14, 2024 | 8:58 PM

హైదరాబాద్‌లో మూడు చోట దారుణ హత్యలు జరిగాయి. రెండుచోట్ల గుర్తు తెలియని దుంగడులు దాడి చేయగా.. చందానగర్‌లో కర్ణాటకకు చెందిన మహిళను హత్య చేశాడు వ్యక్తి.

Hyderabad: హైదరాబాద్‌లో మూడు చోట దారుణ హత్యలు.. ఎక్కడెక్కడ అంటే
Hyderabad Crime
Follow us on

హైదరాబాద్‌లో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి రాయల్ కాలనీలో సయ్యద్ సమీర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. చెంపాపేట్ బాబానగర్ కు చెందిన సయ్యద్ సమీర్ ను రాయల్ కాలనీ వద్ద తల్వార్ తో దారుణంగా హత్యచేసి పారిపోయారు గుర్తుతెలియని దుండగులు. డెకరేషన్ వర్క్ చేసే సమీర్ రాయల్ కాలనీ నుండి ఇంటికి వస్తుండగా హత్య జరిగింది. బాలాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో చాలా మంది ఆకతాయిలు గాంజా సేవించి తరుచు గొడవలకు దిగుతుంటారని స్థానికుల చెబుతున్నారు. కేసు నమోదు చేసి.. సమీర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చరికి తరలించారు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. చందానగర్ పీఎస్ పరిధిలోని నల్లగండ్లలో విజయ లక్ష్మి అనే మహిళను కత్తితో గొంతు కోసి దారుణ హత్య చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన విజయలక్ష్మిని హత్య చేసిన నిందితుడు భరత్ గౌడ్ చందానగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విజయలక్ష్మి, భరత్ గౌడ్ మధ్య వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలు విజయలక్ష్మి తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి నలగండ్లలో నివాసం ఉంటూ అపర్ణ సర్వర్ క్యాంటీన్లో వంట మనిషిగా పనిచేస్తుంది.

అటు హైదరాబాద్‌ లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కుతుబ్బుద్దీన్ అనే యువకుడిపై కత్తులతో పొడిచి పారిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడిని స్థానికులు మెహిదీపట్నం నాల నగర్ లోని ఆలివ్ ఆసుపత్రికి తరలించారు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..