Hyderabad: తాను చనిపోతూ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. మరికొందరి ప్రాణాలు సైతం

అదే సమయంలో వెనకాల నుంచి వస్తున్న ఓ ఆటో వారిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సునీతను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే సునీత అప్పటికే 9 నెలల గర్భిణి. తలకు తీవ్ర గాయం కావడంతో సునీత బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఎమర్జెన్సీ వింగ్‌లో చికిత్స అందించగా...

Hyderabad: తాను చనిపోతూ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. మరికొందరి ప్రాణాలు సైతం
Hyderabad Women Brain Dead

Updated on: Jun 21, 2024 | 9:58 AM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన మహిళ ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడంతో పాటు, మరికొందరు ప్రాణాలను నిలబెట్టింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మద్దికట్ల సునీత అనే 27 ఏళ్ల మహిళ జూన్‌ 8వ తేదీన తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తోంది.

అదే సమయంలో వెనకాల నుంచి వస్తున్న ఓ ఆటో వారిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సునీతను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే సునీత అప్పటికే 9 నెలల గర్భిణి. తలకు తీవ్ర గాయం కావడంతో సునీత బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఎమర్జెన్సీ వింగ్‌లో చికిత్స అందించగా. చికిత్స పొందుతూనే సునీత ఆడబిడ్డకు జన్మించింది. అయితే సునీత ఆరోగ్య విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించలేదు.

సునీతకు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు మంగళవారం వైద్యులు నిర్ధారించారు. దీంతో చేసేది ఏం లేక ఆసుపత్రిలో జీవందన్‌ కోఆర్డినేర్టర్స్ నిర్వహించిన కౌన్సెలింగ్ తర్వాత సునీ భర్తతో పాటు కుటుంబ సభ్యులు సునీత అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. లివర్‌తో పాటు మూత్ర పిండలను ఇద్దరికి అందించారు. ఈ సందర్భంగా జీవన్‌దన్‌ అధికారులు సునీత కుటుంబ సభ్యులను అభినందించారు. ఇలా తాను మరణిస్తూ కూడా మరి కొందరు ప్రాణాలను కాపాడింది సునీత.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..