Telangana: మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం.. మిస్ అవ్వకండి..

హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్. జనవరి 3న అంబర్‌పేట్‌లో ప్రత్యేక డ్రైవర్ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. బైక్, ఈ-ఆటో డ్రైవింగ్‌లో ఆసక్తి ఉన్న 21-45 ఏళ్ల మహిళలకు ఉచిత శిక్షణ, డ్రైవింగ్ లైసెన్స్ సహాయం, 100శాతం ఉద్యోగ హామీ వంటివి కల్పించనున్నారు.

Telangana: మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం.. మిస్ అవ్వకండి..
Hyderabad Women Driver Job Mela

Edited By:

Updated on: Dec 29, 2025 | 5:33 PM

హైదరాబాద్‌లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహించనున్నారు. మహిళలు స్వయం ఉపాధితో ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బైక్, ఈ-ఆటో డ్రైవింగ్ రంగాల్లో ఆసక్తి ఉన్న మహిళలకు ఈ మేళా ద్వారా శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ డ్రైవర్ ఉద్యోగ మేళాలో భాగంగా మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అవసరమైన పూర్తి సహకారం అందించడంతో పాటు శిక్షణ అనంతరం నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే వాహనాల అద్దె సదుపాయం, అవసరమైన వారికి లోన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ ఉద్యోగ మేళా జనవరి 3న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. అంబర్‌పేట్‌లోని పిటిసి వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సి ఉండగా డ్రైవింగ్ అనుభవం లేకపోయినా అవకాశం కల్పిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. మహిళలకు 3 నెలల పాటు ఉచిత శిక్షణ అందించడంతో పాటు శిక్షణ పూర్తయ్యాక 100 శాతం ఉద్యోగ హామీ ఇస్తామని తెలిపారు. మహిళా ప్రయాణికులకు మాత్రమే సేవలు అందించే విధంగా ఈ ఉపాధి అవకాశాలను రూపొందించారు. డ్రైవింగ్ రంగంలో మహిళలకు భద్రత, గౌరవం, స్థిర ఆదాయం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ డ్రైవర్ ఉద్యోగ మేళాకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 8978862299 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని కోరారు.

ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ పోలీసులతో పాటు భరోసా సెంటర్, మోవో సోషల్ ఇనిషియేటివ్స్, తెలంగాణ పోలీసుల ఉమెన్ సేఫ్టీ వింగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మహిళలకు రోడ్డు భద్రత, వృత్తిపరమైన నైపుణ్యాలు, ప్రయాణికులతో వ్యవహరించే తీరుపై కూడా అవగాహన కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణ పూర్తిగా ప్రాక్టికల్‌గా ఉండేలా ప్రత్యేక ట్రైనర్లను నియమించామని వెల్లడించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించడంతో పాటు సమాజంలో భద్రతాయుత ఉపాధి అవకాశాలు పెరగాలనే లక్ష్యంతో ఈ డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. డ్రైవింగ్ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగితే మహిళా ప్రయాణికులకు మరింత భద్రత, విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ఆసక్తి ఉన్న మహిళలు నిర్ణీత తేదీకి ముందుగా నమోదు చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..