Komati Reddy: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే! ఆ రూట్‌లో 6లైన్లు కాదు..8 లైన్‌ల హైవే నిర్మాణం!

తెలంగాణ ప్రజలకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో రూ. 60,799 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టబోతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే రూ.10,400 కోట్లతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని 8 లైన్లకు విస్తరణ చేయనున్నట్లు తెలిపారు.

Komati Reddy: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే! ఆ రూట్‌లో 6లైన్లు కాదు..8 లైన్‌ల హైవే నిర్మాణం!
Tg News

Updated on: Nov 08, 2025 | 2:26 PM

తెలంగాణ ప్రజలకు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో రూ. 60,799 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టబోతున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిన రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్-విజయవాడ హైవే 8 లైన్లకు విస్తరణ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనతో బహుళ జాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారబోతోంది. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి, లక్షలాదిమంది గ్రామీణ యువతకు ఉపాధి కలగనుందన్నారు. అలాగే రూ. 10,400 కోట్లతో హైదరాబాద్- విజయవాడ హైవేను ఎనిమిది లైన్లుగా విస్తరించనున్నట్టు తెలిపారు. అలాగే రూ. 36,000 వేల కోట్లు తెలంగాణ రాష్ట్ర గతిని మార్చే RRR రహదారి నిర్మించబోతున్నట్టు తెలిపారు. రోడ్లు లేని గ్రామీణ ప్రాంతాల్లో నూతన రోడ్లు వేస్తామని, హ్యామ్‌ ప్రాజెక్టుకు రూ.11,399 కోట్లు కేటాయించామని.. త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని మంత్రి కోమటి రెడ్డి అన్నారు.

పెట్టుబడులకు డెస్టినేషన్‌గా తెలంగాణ

వీటితోపాటు ప్రపంచంలోని పెట్టుబడిదారులు అంతా తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రహదారుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రానున్నాయని తెలిపారు. ఫలితంగా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాదిమంది రాష్ట్ర యువతకు ఉపాధి లభించనుందన్నారు.

రూ.8వేల కోట్లతో ఎలివేటెడ్ కారిడార్‌

రూ. 8,000 వేల కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించబోతున్నామని. దేశానికే తలమానికంగా మారనున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు రూ. 20 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో రాష్ట్ర ముఖచిత్రమే మారుతుందన్నారు.

న భూతో న భవిష్యత్తు అన్న రీతిలో రహదారుల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. నా రాజకీయ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలని మంత్రి అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.