Fooding and Mink Pub Case: డ్రగ్స్ కేసులో మొదటి రోజు విచారణలోనే సంచలన విషయాలు బయటకొచ్చాయి. ప్రధాన నిందితులు అనిల్, అభిషేక్‌ల లింక్స్ వెలుగులోకి వచ్చాయి. ఇవాళ జరిగే విచారణలో ఏం రాబోతోందోనని ఉత్కంఠగా ఉంది. అయితే, పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో సంచలనాలు బయట పడుతున్నాయి. పోలీసుల విచారణలో నిందితులు ఒక్కో విషయాన్ని వెళ్లడిస్తున్నారు. కోర్టు అనుమతితో ప్రధాన నిందితులు అనిల్, అభిషేక్‌లను అదుపులోకి తీకున్నపోలీసులు.. మొదటి రోజు పలు అంశాలపై విచారించారు. తరుచూ పబ్‌కు వెళ్తున్న వీవీఐపీల లిస్టు పోలీసులకు చిక్కింది. ప్రధానంగా ఓ ఆరుగురి సాయంతో కొకైన్ సరఫరా అవుతుందని తేలింది. దీనిపైనే అనిల్-అభిషేక్‌ల మధ్య కాల్స్ నడిచినట్టు తెలుస్తోంది. పెడ్లర్లలో అనిల్ నిత్యం టచ్‌లో ఉండే వాడు. పబ్‌లో నమ్మకం కుదిరినాకే డ్రగ్ సరఫరా చేసే వారు. అది కూడా కోడ్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఇద్దరి మధ్య ముందే ఫోన్ సంభాషణ జరిగినట్టు తేలింది. కొకైన్ గురించే ఫోన్‌లో మాట్లాడినట్టు నిర్ధారించారు.
మేనేజర్ అనిల్ ఫోన్‌లో డ్రగ్స్ పెడ్లర్స్ నెంబర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారం మేరకు.. కొకైన్ ఎవరికి వెళ్లిందనే విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. మొదటి రోజు విచరణలో ప్రధానంగా డ్రగ్స్‌పై ఫోకస్ పెట్టారు పోలీసులు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు అందజేశారు? ఎప్పటి నుంచి డ్రగ్స్ దందా నడుస్తున్నది? ఎంత మంది కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేశారు? అనే ప్రధాన అంశాలపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. దీనికి తోడు.. ఇప్పటికే పోలీసుల దగ్గర ఉన్న సమాచారంపై కూడా ప్రశ్నలు అడినట్టు తెలుస్తోంది. ఇక ఇవాళ జరిగే విచారణలో ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయోనని ఉత్కంఠగా ఉంది. పోలీసులు మాత్రం కీలక సమాచారం రాబడుతున్నారు. ప్రముఖుల పేర్లు కూడా లిస్టులో ఉన్నాయని తెలుస్తోంది.
Also read: