Watch: పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణం ఆలస్యమైనా పెను ప్రమాదమే!

హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. బైక్‌ను తప్పించబోయి జరిగిన ఈ ప్రమాదంలో బంకులో ఉన్న రెండు కార్లు, ఓ ఆటో ధ్వంసమయ్యాయి. డీజిల్ పంపు సమీపంలోకి బస్సు వెళ్లినా, జనసంచారం తక్కువగా ఉండటంతో పెను ప్రాణనష్టం తప్పింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Watch: పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. క్షణం ఆలస్యమైనా పెను ప్రమాదమే!
Rtc Bus Accident

Updated on: Sep 10, 2026 | 6:11 PM

హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బైక్‌ను తప్పించబోయిన బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకులోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ ప్రమాదంలో పెట్రోల్‌ బంకు వద్ద నిలిపి ఉంచిన రెండు కార్లు, ఓ ఆటో ధ్వంసమయ్యాయి. బస్సు ఢీకొట్టిన ప్రాంతానికి సమీపంలోనే డీజిల్‌ పంపు ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాద సమయంలో బంకు వద్ద పెద్దగా జనసంచారం లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

బస్సు అదుపుతప్పి బంకులోకి దూసుకెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బైక్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన సమయంలోనే డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బస్సు వేగం, డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పెట్రోల్‌ బంకులోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. డీజిల్‌ పంపు వద్దే బస్సు దూసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us