రేపే అమావాస్య.. అస్సలే చేయకూడని పనులివే..

samatha

10 september 2026

Pic credit - Pinterest

జ్యోతిష్యశాస్త్రంలో అమావాస్య ,పౌర్ణమిలకు చాలా ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంటుంది. ప్రతి నెల ఇవి వస్తుంటాయి.

అయితే సెప్టెంబర్ 11న పొలాల అమావాస్య. అయితే ఈ అమావాస్యకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెబుతున్నారు పండితులు.

అందుకే ఈ పొలాల అమావాస్య సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పనులు చేయకూడదంట. ఇంతకీ అవి ఏవో చూసేద్దాం.

చాలా మంది అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేస్తుంటారు. కానీ ఈ రోజు ప్రయాణాలు చేయడం అస్సలే మంచిది కాదంట.

అలాగే కొంత మంది అమావాస్య సమయంలో జుట్టు కత్తిరించడం చేస్తుంటారు. కానీ ఈ రోజు జుట్టు కత్తిరించడం అస్సలే మంచిదికాదంట.

అదే విధంగా అమావాస్య రోజున గోర్లు కట్ చేయడం వలన దరిద్రం చుట్టుకుంటుందంట. అందుకే ఈ రోజు గోర్లు కట్ చేయకూడదు.

అమావాస్య రోజు శుభకార్యాలు చేయడం కూడా అస్సలే మంచిది కాదు, అలాగే కొత్త వాహనాలు, కొనుగోళ్లు కూడా చేయకూడదంట.

అదే విధంగా ఈరోజు తలకు నూనె పెట్టుకోవడం కూడా మంచిది కాదు అని చెబుతారు. అందువలన ఈ పనులను అస్సలే ఈ రోజు చేయకూడదంట.