AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మృత్యువు అంచున పసికందు.. సకాలంలో పసికందుకు పునర్జన్మ ప్రసాదించిన పోలీసులు..!

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసుల అప్రమత్తత, మానవత్వం మరోసారి ప్రాణాలను కాపాడింది. జూన్ 18న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్వాస ఆగిపోయి స్పృహ కోల్పోయిన ఏడాది వయసున్న పసికందును పోలీసులు సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేసి ప్రాణాపాయం నుంచి బయటపడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మృత్యువు అంచున పసికందు.. సకాలంలో పసికందుకు పునర్జన్మ ప్రసాదించిన పోలీసులు..!
Police Saves Infant
Balaraju Goud
|

Updated on: Jun 20, 2026 | 3:06 PM

Share

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసుల అప్రమత్తత, మానవత్వం మరోసారి ప్రాణాలను కాపాడింది. జూన్ 18న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్వాస ఆగిపోయి స్పృహ కోల్పోయిన ఏడాది వయసున్న పసికందును పోలీసులు సీపీఆర్ (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) చేసి ప్రాణాపాయం నుంచి బయటపడేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమాచారం ప్రకారం, రాజేంద్రనగర్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ తన బృందంతో కలిసి రాత్రి గస్తీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో శంషాబాద్-ఆరామ్‌ఘర్ రహదారిపై ఒక కారు ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కుటుంబం ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌కు నిద్రమత్తు రావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో ఉన్న కుటుంబ సభ్యులను బయటకు తీసే క్రమంలో ఏడాది వయసున్న బాలుడు శ్వాస తీసుకోకపోవడం, స్పృహ కోల్పోవడం గమనించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

అయితే పరిస్థితిని చాకచక్యంగా అంచనా వేసిన పోలీసులు వెంటనే బాలుడికి సీపీఆర్ అందించారు. కొన్ని క్షణాల తర్వాత బాలుడు తిరిగి శ్వాస తీసుకోవడం ప్రారంభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఆ కుటుంబాన్ని సమీప ఆసుపత్రికి సురక్షితంగా తరలించి వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.

ఈ ఘటనపై స్పందించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, డీసీపీ శ్రీనివాస్‌తో పాటు పోలీసు బృందాన్ని అభినందించారు. తమ విధిని నిర్వర్తించడమే కాకుండా ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడి మానవత్వాన్ని చాటిచెప్పారని కొనియాడారు. అలాగే సుదూర ప్రయాణాల్లో డ్రైవర్లు నిద్రమత్తుగా అనిపిస్తే తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?