Hyderabad: నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం.. కట్‌చేస్తే..

బేగంపేటలోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్‌గా ఉన్న వ్యక్తి ఇతర సిబ్బందితో కలిసి కస్టమర్ సంతకాలను పోర్జరీ చేసి వారి అకౌంట్‌ నుంచి సుమారు రూ.6.5 కోట్లు కాజేశారని ఆరోపణలు రావడంతో అతన్ని అదుపులోకి తీసుకన్నారు పోలీసులు. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Hyderabad: నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం.. కట్‌చేస్తే..
Telangana Crime

Updated on: Apr 12, 2026 | 11:03 PM

తమ సంతకాలను పోర్జరీ చేసి చెక్కులతో తన అకౌంట్‌లో ఉన్న రూ.6.5 కోట్లను బేగంపేట్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి కాజేశారని పోలీసులను ఆశ్రయించాడు ఓ కస్టమర్. బాధితుడి ఫిర్యాదును పరిగణిలోకి తీసుకున్న పోలీసులు ఈ కేసుల్లో తాజాగా బ్యాంకు మేజనర్ వెంకటరమణ అరెస్ట్ చేశారు. కస్టమర్ విదేశాల్లో ఉన్న సమయంలో అతని సంతకం ఫోర్జరీ చేసి 42 లూజ్ లీఫ్ చెక్కుల వినియోగించారని బాధితుడు పేర్కొన్నాడు. ఆ చెక్కుల ద్వారా తన అకౌంట్లో నుంచి సుమారు రూ. 6.5 కోట్లు కాజేశారని ఆరోపించాడు.

ఈ గోల్ మాల్ లో బ్రాంచ్ సీనియర్ అధికారులు, ఆపరేషన్స్ టీమ్ ప్రమేయం ఉన్నట్లు కూడా ఆరోపించాడు. దోచుకున్న డబ్బును మొత్తం ఇతర ఖాతాలకు మళ్లించారని. ఫ్రంట్ ఆఫీస్ నుంచి క్లియరింగ్ విభాగం వరకు కుమ్మక్కు ఈ కుంభకోనానికి పాల్పడ్డారు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన బ్యాంక్ ఖాతా అనుమతి లేకుండా క్లోజ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

తనతో పాటు అనేక మంది బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయం అవుతున్నట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా బ్యాంక్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. అతన్ని కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us