ఆ హీరోతో డేట్‏కు వెళ్తా.. మీనాక్షి చౌదరి ఓపెన్ స్టేట్మెంట్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

29 August 2026

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ మీనాక్షి చౌదరి.

'గుంటూరు కారం', 'ది గోట్', 'లక్కీ భాస్కర్' వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లతో టాప్ హీరోయిన్‌గా మారిన ఈ భామ, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమిళ స్టార్ హీరో శింబు పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టారు. "మీ డ్రీమ్ మూవీ డేట్ ఎవరితో ఉంటుంది?" అని ప్రశ్నించగా

ఆమె తడుముకోకుండా కోలీవుడ్ స్టార్ హీరో సిలంబరసన్ (శింబు) పేరు చెప్పారు. శింబు నటన, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.

ఆయనతో కలసి ఒక రొమాంటిక్ థ్రిల్లర్ లేదా లవ్ స్టోరీ సినిమాలో నటించడం కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లలో ఒకటని మీనాక్షి తన మనసులోని మాటను బయటపెట్టారు.

శింబుపై మీనాక్షి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శింబు నటిస్తున్న తదుపరి భారీ మూవీలో మీనాక్షి చౌదరి నటించనుందట

ఈ క్రేజీ కాంబినేషన్ నిజమైతే తెరపై శింబు-మీనాక్షిల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రస్తుతం సౌత్ లో ఆమె బిజీ హీరోయిన్. 

వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న మీనాక్షి.. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది ఈ భామ.