Telangana: మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను పోలీసులు ఎలా గుర్తించారంటే..?

దేవుడి దర్శనం ముగించుకుని సంతోషంగా ఇంటికి వస్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ధాటికి ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అయితే మృతదేహాల వద్ద ఎలాంటి ఆధారాలు లేని స్థితిలో.. పోలీసులు ఒక వేలిముద్ర సాయంతో మృతుల వివరాలను ఎలా ఛేదించారు? టెక్నాలజీని ఉపయోగించి కుటుంబ సభ్యులను ఎలా గుర్తించారు? అనేది తెలుసుకుందాం..

Telangana: మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను పోలీసులు ఎలా గుర్తించారంటే..?
Police Use Fingerprint To Identify Victims

Edited By:

Updated on: May 03, 2026 | 12:28 PM

హైదరాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల గుర్తింపు కోసం పోలీసులు టెక్నికల్‌గా ఆలోచించారు . ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన ఈ ప్రమాదంలో మృతదేహాల వద్ద ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో పోలీసులు ఒక మృతుడి ఫింగర్‌ప్రింట్‌ను ఉపయోగించి అతని మొబైల్ ఫోన్‌ను అన్‌లాక్ చేసి కుటుంబ సభ్యులను గుర్తించారు. ఈ ఘటన షంషాబాద్ సమీపంలోని తుండుపల్లి వద్ద చోటుచేసుకుంది. వాగనర్ కారు రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒకరైన వ్యక్తి బైల్ ఫోన్ పక్కనే లభించడంతో అతని ఫింగర్‌ప్రింట్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేసి నాన్న అనే కాంటాక్ట్‌ను సంప్రదించారు. ఆ తరువాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తరువాత పోలీసులు మరిన్ని వివరాలు సేకరించి మృతులను శివకుమార్ కుటుంబంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో శివకుమార్, అతని భార్య, పిల్లలు, బంధువులు కలిసి మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. యాదగిరిగుట్ట ఆలయ దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ దుర్ఘటన జరిగింది

పోలీసుల ప్రాథమిక విచారణలో డ్రైవర్ వేగంగా వాహనం నడపడం, అలాగే రోడ్డుపై నిలిపి ఉన్న లారీని గమనించకపోవడం ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మరోవైపు లారీ రోడ్డుపక్కన పార్క్ చేయడం కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి కారణమైందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్ పై తరచుగా జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని డిజిపి సివి ఆనంద్ సమీక్ష సమావేశం నిర్వహించారు

Follow Us