Hyderabad Metro Rail: భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్.. మెట్రో రైలు సర్వీసుల సమయం పెంపు

|

Nov 09, 2021 | 5:31 PM

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. మరోసారి మెట్రో రైలు సర్వీసు సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Hyderabad Metro Rail: భాగ్యనగరవాసులకు గుడ్‌న్యూస్..  మెట్రో రైలు సర్వీసుల సమయం పెంపు
Hyderabad Metro Rail Copy
Follow us on

Hyderabad Metro Timings: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. మరోసారి మెట్రో రైలు సర్వీసు సమయాల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ మెట్రో సంస్థ. ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ (హెచ్‌ఎంఆర్‌) వేళల్లో మార్పులు చేసింది. కొత్త టైంటేబుల్ నవంబర్‌ 10 నుంచే అమలులోకి రానున్నాయి. ఉదయం 6 గంటలకు తొలి మెట్రో రైలు ప్రారంభం కానుంది. అలాగే రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్‌ నుంచి మెట్రో రైలు బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది. మెట్రో సేవలు పొడిగించాలని మంత్రి కేటీఆర్‌ను ఓ ప్రయాణికుడు కోరడంతో దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి.. మెట్రో రైల్ ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మెట్రో రైల్ సేవల వేళ్లలో మార్పులు చోటుచేసుకున్నాయి.


ఇదిలావుంటే, అభినవ్‌ సుదర్శి అనే ప్రయాణికుడు ఉదయం వేళ మెట్రోరైలు ఫ్లాట్‌ఫామ్‌ల వద్ద రైళ్ల కోసం ఎదురు చూస్తున్న జనం రద్దీ, వృద్ధులు, మహిళలు పడుతున్న ఇబ్బందులను వీడియో తీసి రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా సోమవారం ట్యాగ్‌ చేశారు. తెల్లవారుజామునే నగరానికి వచ్చే వారికి రవాణా సౌకర్యాలు సరిగాలేక ఇబ్బందులు పడుతున్నట్టు పేర్కొన్నారు. ఉదయం 6 నుంచే మెట్రోరైళ్లు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. అభినవ్‌ మాటలతో ఏకీభవిస్తున్నట్టు రీట్వీట్‌ చేశారు. మెట్రో ఎండీ స్పందించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దీనికి మెట్రో ఎండీ సైతం సానుకూలంగా స్పందించారు. దీంతో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న నగరవాసులక కొత్త టైంటేబుల్ ఊరటనివ్వనుంది.


Read Also…. కష్టపడకుండానే కోటి రూపాయలు కొట్టెయ్యడానికి కంత్రీ ప్లాన్.. బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్‌తో బీమా క్లెయిమ్