Weather Report: తెలంగాణకు ఎల్లో అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు

తెలంగాణ ప్రజలను హైదరాబాద్‌ వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి..

Weather Report: తెలంగాణకు ఎల్లో అలర్ట్‌.. ఈ ప్రాంతాల్లో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
Hyderabad

Updated on: May 30, 2023 | 6:33 PM

తెలంగాణ ప్రజలను హైదరాబాద్‌ వాతావరణ శాఖ అలర్ట్‌ చేసింది. రాష్ట్రంలో పలు చోట్ల రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వీటితో పాటు నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వీటితో పాటు రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి వానలు పడుతాయని అధికారులు అంచనా వేశారు. బుధవారం నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే సూచనలున్నాయని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇందులో భాగంగానే ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక మంగళవారం పెద్దపల్లి, మహబూబాబాద్‌, ఖమ్మం, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా గుర్రంపోడులో 73.8 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..