
Weather

వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం నల్గొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

ఇక సోమవారం విషయానికొస్తే రాష్ట్రంలోని 20 జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతా జిల్లాలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపే, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.

అయితే రాబోయే నాలుగు రోజులు పాటు అంటే మే 21 వరకు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోను వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురువనుండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.