Hyderabad: ‘ప్లీజ్ నన్ను కాపాడండి.. కన్న తల్లిదండ్రులతో ప్రాణహాని ఉంది’.. హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన ఓ కొడుకు..

|

Jun 07, 2022 | 5:20 PM

Hyderabad: సహజంగానే తల్లిదండ్రులకు తమ పిల్లలే తమ సర్వస్వం. తమ పిల్లలకు కళలో కూడా హానీ తలపెట్టాలని చూడరు. వారికి చిన్నగాయం అయినా..

Hyderabad: ‘ప్లీజ్ నన్ను కాపాడండి.. కన్న తల్లిదండ్రులతో ప్రాణహాని ఉంది’.. హెచ్ఆర్‌సీని ఆశ్రయించిన ఓ కొడుకు..
Telangana
Follow us on

Hyderabad: సహజంగానే తల్లిదండ్రులకు తమ పిల్లలే తమ సర్వస్వం. తమ పిల్లలకు కళలో కూడా హానీ తలపెట్టాలని చూడరు. వారికి చిన్నగాయం అయినా తల్లడిల్లిపోతుంటారు. ఎదుటి వారితో వారికి ఏవైనా సమస్యలుంటే.. వారితో పోరాడి మరీ తమ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే తల్లిదండ్రులు పూర్తి రివర్స్. ఎందుకంటే.. ఓ వ్యక్తి తన తల్లిదండ్రులతోనే ప్రాణహాని ఉందంటూ ఏకంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. వారి వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ హెచ్ఆర్‌సీని వేడుకున్నాడు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేట గ్రామానికి చెందిన మాలె శ్రీనివాస్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తన తల్లిదండ్రులైన మాలె సత్యనారాయణ , మాలె సత్యవతిలు ఊరిలో ఉన్న ఆస్తులను అమ్మేసి.. మళ్లీ డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని కమిషన్ కు విన్నవించాడు. తాను బ్యాంక్ లోన్ తీసుకొని ఎంసీఏ పూర్తి చేశానని.. పార్ట్ టైం జాబ్ చేస్తూ లోన్లు కట్టుకున్నానని వివరించాడు. ఆస్తులు అమ్మడమే కాకుండా ఊరిలో అప్పులయ్యాయని అనడంతో గత ఏడాది రూ. 22 లక్షలు పెద్దల సమక్షంలో ఇచ్చానని పేర్కొన్నాడు. మళ్లీ ఇప్పుడు రూ. 15 లక్షలు ఇవ్వాలని తన తల్లిదండ్రులు వేధిస్తున్నారని, వారి వేధింపులకు బ్రెయిన్ టిబి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను మానసికంగా వేధిస్తున్న తన తల్లిదండ్రులపై, స్థానిక ఎల్లంపేట సర్పంచ్, మరిపేడ పోలీసులపై చర్యలు తీసుకొని.. తనకు రక్షణ కల్పించాలని కమిషన్ ను వేడుకున్నాడు శ్రీనివాస్.