నమ్మించి ముంచారు.. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. 30 తులాల బంగారం మాయం!

గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో ఓ మహిళను నమ్మించి, రూ. 18 లక్షల నగదుతో పాటు 30 తులాల బంగారు ఆభరణాలను కాజేసిన ఘరానా మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో మధురానగర్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తండ్రీ కొడుకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నమ్మించి ముంచారు.. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. 30 తులాల బంగారం మాయం!
Gold Trading Fraud

Updated on: Jul 10, 2026 | 1:08 PM

గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో ఓ మహిళను నమ్మించి, రూ. 18 లక్షల నగదుతో పాటు 30 తులాల బంగారు ఆభరణాలను కాజేసిన ఘరానా మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో మధురానగర్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మహానగరం యూసుఫ్‌గూడకు చెందిన శ్రీలత, చంద్రశేఖర్ దంపతులకు బాలకృష్ణ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని దంపతులను నమ్మించాడు. అతని మాటలను నిజమని నమ్మిన శ్రీలత.. బాలకృష్ణ సూచించిన కోసమట్టం ఫైనాన్స్ సంస్థను ఆశ్రయించింది. తన వద్ద ఉన్న 30 తులాల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి సుమారు రూ. 18 లక్షల గోల్డ్ లోన్ తీసుకుంది. ఆ మొత్తాన్ని పెట్టుబడి నిమిత్తం బాలకృష్ణ ఖాతాకు బదిలీ చేసింది.

అయితే, డబ్బులు తీసుకున్న బాలకృష్ణ అంతటితో ఆగకుండా బాధితులకు తెలియకుండానే ఫైనాన్స్ మేనేజర్‌తో కుమ్మక్కయ్యాడు. వారి పేరు మీద ఉన్న 30 తులాల బంగారాన్ని కూడా మాయం చేశాడు. తాము మోసపోయామని గ్రహించిన శ్రీలత.. బాలకృష్ణ, అతని కుమారుడు నిఖిల్ కలిసి కోసమట్టం ఫైనాన్స్ మేనేజర్ సహాయంతో తమును నిలువునా ముంచారని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us