హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. KBR చుట్టూ వన్‌వే! భారీగా రూట్ల మార్పు.. ఇవి కచ్చితంగా తెలుసుకోండి

H-CITI ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా కేబీఆర్ పార్క్ చుట్టూ జూన్ 21, 2026న ఉదయం 10 నుండి రాత్రి 8 వరకు వన్-వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వాహనదారులు నిర్దేశిత ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలను తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. KBR చుట్టూ వన్‌వే! భారీగా రూట్ల మార్పు.. ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Hyderabad Traffic Kbr Park

Edited By:

Updated on: Jun 21, 2026 | 12:26 PM

హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న అన్ని రోడ్లలో 21.06.2026 (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వన్-వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు ట్రాఫిక్ పోలీసులు. సైన్‌బోర్డుల ఆధారంగా వాహనదారులు ఎడమ, కుడి లేన్‌లలోకి మారడానికి ‘లేన్ చేంజర్స్’ ఉపయోగించాల్సిందిగా సూచించారు.

ట్రాఫిక్ మళ్లింపు వివరాలు..

1. NFCL వైపు నుండి SNT, సాగర్ సొసైటీ (ముగ్ధ), KBR పార్క్ ఎంట్రన్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నెం. 36, రోడ్ నెం. 45, కేబుల్ బ్రిడ్జ్ (దుర్గం చెరువు) వైపు వెళ్లే వాహనదారులు ఎన్టీఆర్ భవన్ వద్ద ఎడమ మలుపు తీసుకుని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైపు ప్రయాణించాలి. -> అగ్రసేన్ ఐలాండ్ మీదుగా ఒమేగా హాస్పిటల్ -> భారతీయ విద్యాభవన్ జంక్షన్ -> రోడ్ నెం.45, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబుల్ బ్రిడ్జ్, ఐకియా (IKEA) వైపు వెళ్ళవచ్చు.

2. యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ వైపు నుండి రోడ్ నెం.36 అండ్ 45, జూబ్లీహిల్స్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనదారులు.. రూట్ 1: ఇందిరానగర్ గడ్డ రోడ్ (రోడ్ నెం. 5, జూబ్లీహిల్స్) మీదుగా వెంకటగిరి జంక్షన్ వైపు వెళ్లాలి -> వెంకటగిరి జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకుని -> డైమండ్ హౌస్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.10 వైపు ప్రయాణించాలి -> అక్కడ నుండి అల్-కాజర్ (Al-Cazar) వైపు వెళ్లి కుడి మలుపు తీసుకుని రోడ్ నెం.36 (నీరూస్ వైపు), రోడ్ నెం.45, జూబ్లీహిల్స్, మాదాపూర్ వైపు వెళ్లవచ్చు. రూట్ 2: అన్నపూర్ణ స్టూడియో బైలేన్ (ఉపమార్గం) మీదుగా ప్రయాణించి ఎన్టీఆర్ భవన్ (రోడ్ నెం. 2) వైపు ఎడమ మలుపు తీసుకోవాలి -> బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్ మీదుగా -> భారతీయ విద్యాభవన్ దాటి ఫిలింనగర్ (రోడ్ నెం. 82), సెనార్ వ్యాలీ, షేక్‌పేట్ వైపు వెళ్లవచ్చు.

3. ITC కోహినూర్, కేబుల్ బ్రిడ్జ్ (దుర్గం చెరువు) నుండి రోడ్ నెం.45 జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి, ఎన్టీఆర్ భవన్, పంజాగుట్ట వైపు వెళ్లే వాహనదారులు సులువైన ప్రయాణం కొరకు రోడ్ నెం.60, 67 మీదుగా ప్రయాణించి, రోడ్ నెం.1 ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు చేరుకోవాలి -> అక్కడి నుండి వెంకటగిరి, ఎన్టీఆర్ భవన్, పంజాగుట్ట వైపు వెళ్లవచ్చు.

వాహనదారులకు ముఖ్య సూచనలు

  • ఆదివారం ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు పైన పేర్కొన్న ట్రాఫిక్ మళ్లింపులను తప్పనిసరిగా పాటించాలి.
  • ఈ నిర్దేశిత మార్గాల్లో ఎక్కడా ‘U’ టర్న్‌లు ఉండవు. ఇబ్బంది లేకుండా ఎగ్జిట్ అవ్వడానికి రోడ్డుకు ఎడమ వైపున (LEFT side) ప్రయాణించాలి.
  • ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి మార్గంలో ఏర్పాటు చేసిన నిర్దేశిత ఎగ్జిట్ పాయింట్లను గమనించాలి.
  • రోడ్డుపై ఉండే ట్రాఫిక్ పోలీసుల సూచనలను, సైన్‌బోర్డులను కచ్చితంగా పాటించాలి.
  • రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నావిగేషన్ యాప్‌లను ఉపయోగించండి.
  • ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వీలైనంత వరకు ప్రజా రవాణా లేదా కార్ పూలింగ్ (Car Pooling)కు ప్రాధాన్యత ఇవ్వండి.
  • రద్దీ సమయాల్లో భారీ వాహనాలు ఈ మార్గాల్లో రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
Follow Us