
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. కాచీగూడ నుంచి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు డైలీ ట్రైన్ నడపనుంది. హైదరాబాద్‌లోని రాజస్థాన్ వ్యాపారులు రోజూవారీ ట్రైన్ నడపాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని కలిసి రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం రైల్వే మంత్రికి లేఖ రాశారు. ఈ రైలు ఏర్పాటుతో వేలాది మందికి మేలు జరుగుతుందని లేఖలో వివరించారు. దీంతో అశ్వినీ వైష్ణవ్ రైలు సర్వీసుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 19న కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డిలు ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. జూలై 20 నుంచి రోజూవారీగా ఈ రైలు నడుస్తుంది.
ఈ నెల 20నుంచి ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ ప్రారంభం కానుంది. 17605 నెంబర్ గల ట్రైన్ కాచిగూడ నుండి రాత్రి 11:50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:05 గంటలకు ఖాండ్వా చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇటార్సి, నర్మదాపురం, రాణి కమలపతి మీదుగా ఉదయం 4:00 గంటలకు ఉజ్జయిని చేరుకుంటుంది. ఇది అజ్మీర్ మార్గం ద్వారా రాత్రి 8:00 గంటలకు భగత్ కి కోఠి (జోధ్‌పూర్) చేరుకుంటుంది. తిరిగి వెళ్ళేటప్పుడు, 17606 నెంబర్ గల రైలు రాత్రి 10:30 గంటలకు భగత్ కి కోఠి నుండి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1:00 గంటలకు ఉజ్జయిని, రాత్రి 10:40 గంటలకు ఖాండ్వా చేరుకుంటుంది. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం 3:40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఈ రైలు కాచిగూడ నుండి ప్రారంభమై నిజామాబాద్, నాందేడ్, పూర్ణ, హింగోలి, వాషిం, అకోలా, మల్కాపూర్, ఖాండ్వా, ఇటార్సీ, నర్మదాపురం, రాణి కమలపతి, సంత్ హిర్దారం నగర్, సెహోర్, మక్సీ, ఉజ్జయిని, రత్లాం, మక్సీ, ఉజ్జయిని, రత్లాం, జవ్రా, నేమ్‌డ్‌స, జవ్రా, మంద్రా, బిజయ్‌నగర్, నసీరాబాద్, అజ్మీర్, బీవార్, సోజత్ రోడ్, మార్వార్ జంక్షన్, పాలి మార్వార్, భగత్ కి కోఠి (జోధ్‌పూర్).
కొత్త రైలు నిర్మాణం ప్రకారం మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. ఇందులో రెండు ఏసీ టూ-టైర్ కోచ్‌లు, 7 ఏసీ త్రీ-టైర్ కోచ్‌లు, 7 స్లీపర్ కోచ్‌లు, నాలుగు సెకండ్ ఆర్డినరీ కోచ్‌లు, రెండు జనరేటర్ కార్లు ఉంటాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..