హైదరాబాద్ మహానగరానికి మంచినీటి వెతలు తప్పించేందుకు జలమండలి(Jalamandali) అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించి, వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేస్తు్నారు. ఈ క్రమంలో పటాన్ చెరు నుంచి హైదర్ గూడ వరకు ఉన్న డయా పంపింగ్ మెయిన్ పైప్ లో తలెత్తిన వాటర్ లీకేజీలు నివారించేందుకు అధికారులు నిర్ణయించారు. ఫలితంగా ఆర్సీ పురంలోని లక్ష్మీ గార్డెన్ వద్ద, మదీనాగూడలోని సుమన్ కాలేజీ వద్ద మరమ్మత్తు పనులను జలమండలి చేపట్టనుంది. ఈ పనులు 11.04.2022 ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 12.04.2022 తేదీ ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయని జలమండలి అధికారులు వెల్లడించారు. కావునా ఈ 24 గంటల వరకు మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ – 2 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. నగరవాసులు గ్రహించి, సహకరించాలని కోరారు.
నగరంలోని బీరంగూడ, అమీన్ పూర్, ఆర్సీ.పురం, దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, గంగారం, చందానగర్, మియాపూర్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, బొల్లారం, హైదర్ నగర్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదు. అలాగే, ఎర్రగడ్డ, బంజారాహిల్స్ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో ఈ 24 గంటల పాటు లోప్రెషర్తో నీటి సరఫరా అవుతుందని అధికారులు వెల్లడించారు.
Also Read
Beast: RRR లా కాదు !! బీస్ట్ మూవీ విషయం లో విజయ్ రూటే వేరు !!
Chennai: చెన్నై విమానాశ్రయంలో పురాతన శివలింగం స్మగ్లింగ్.. అప్రమత్తమైన అధికారులు.. చివరికి
Russian Ukraine War: రైల్వే స్టేషన్‌పై రాకెట్ దాడి.. 30 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు