Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అర్ధరాత్రి తర్వాత కూడా ఆర్టీసీ బస్సులు.. తొలుత ఈ రూట్లల్లో..

హైదరాబాద్‌లోని టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట కూడా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. వివిధ రద్దీ రూట్లల్లో వీటిని నడపనుంది. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టుగా కొన్ని రూట్లలో నడపనుండగా.. అనంతరం మిగతా రూట్లల్లో ప్రవేశపెట్టనుంది.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. అర్ధరాత్రి తర్వాత కూడా ఆర్టీసీ బస్సులు.. తొలుత ఈ రూట్లల్లో..
Tgsrtc

Updated on: Aug 25, 2026 | 4:16 PM

హైదరాబాద్ వాసులకు భారీ గుడ్‌న్యూస్. ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ భారీ శుభవార్త అందించింది. ఇప్పటివరకు అర్ధరాత్రి వరకు నగరంలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. సాయంత్రం షిప్టులు చేసుకుని ఇళ్లకు వెళ్లేవారికి ఇవి ఉపయోగపడనున్నాయి. అయితే ఇక నుంచి అర్థరాత్రి దాటాక కూడా బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఇక నుంచి రాత్రి 10.30 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు బస్సులను వివిధ రూట్లలో తిప్పనుంది. ప్రస్తుతం రాత్రి 12 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటుండగా.. ఉదయం 5 గంటల తర్వాత తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇక నుంచి అర్థరాత్రి 12 నుంచి 5 గంటల వరకు కూడా బస్సు సర్వీసులు నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

తెల్లవారుజాము వరకు బస్సులు

ముందుగా ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులను రాత్రి 10.30 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు తిప్పనుంది. ప్రయాణికుల ఆక్సుపెన్సీ, స్పందన ఆధారంగా మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం కొన్ని రూట్లలో తిప్పనుండగా.. అనంతరం ఇతర మార్గాల్లో కూడా ప్రవేశపెట్టనున్నారు. తొలి దశలో రద్దీగా ఉండే ఆరు ప్రధాన మార్గాల్లో బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒక్కొ మార్గంలో కనీసం 5 చొప్పున 30 బస్సులను తిప్పనున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు అర్థరాత్రి సిటీలోకి చేరుకుంటాయి. అలాగే నగరంలో రాత్రి షిఫ్టులు చేసేవారికి కూడా బస్సులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఇలాంటి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని బస్సులను అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తిప్పాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

తొలుత ఈ రూట్లల్లోనే..

మేడ్చల్-గచ్చిబౌలి(195), సికింద్రాబాద్-పటాన్ చెర్వు(219), కోఠి-పటాన్ చెర్వు(218), కోఠి-పటాన్ చెర్వు(222A), కొండాపూర్-సికింద్రాబాద్(10H), హయత్ నగర్-జేబీఎస్(290U) ప్రధాన మార్గాల్లో రాత్రి సమయాల్లో బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. రాత్రి సమయాల్లో ఉద్యోగాలు ముగించుకుని ఇంటికి వెళ్లే ఉద్యోగులకు ఇవి ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం అర్థరాత్రి తర్వాత బస్సు సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో నైట్ షిఫ్ట్‌లు చేసేవారు క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. వీటిల్లో అధిక ఛార్జీలు ఉంటున్నాయి. అయితే రాత్రి సమయాల్లో బస్సు సర్వీసులు ఉండటం వల్ల ప్రయాణ ఛార్జీలు కూడా తగ్గుతాయి. అలాగే ప్రజా రవాణా వ్యవస్థ కూడా మరింత పెరుగుపడుతుంది. రాత్రి పూట ఐటీ, బీపీవో, ఇతర ఉద్యోగాలు చేసేవారికి ప్రయోజనం చేకూరనుంది. ఐటీ కారిడార్లను అనుసంధానించేలా ఈ బస్సును తిప్పనున్నారు. రానన్న రోజుల్లో మిగతా రూట్లలో కూడా బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. నగర ప్రజలకు ఇది శుభవార్తగా చెప్పవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us